September 2022 Horoscope: సెప్టెంబర్ నెల అదృష్ట రాశులు ఇవే.. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు..!

Monthly Horoscope September 2022: సెప్టెంబరు నెల కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండనుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశులవారికి ఇంట్లో దేనికీ లోటు ఉండదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2022, 08:46 AM IST
September 2022 Horoscope: సెప్టెంబర్ నెల అదృష్ట రాశులు ఇవే.. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు..!

Monthly Horoscope September 2022: సెప్టెంబర్ నెల కొందరికి చాలా ప్రత్యేకమైనది. నెలవారీ జాతకం ప్రకారం, ఈ రాశులవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో సెప్టెంబర్‌లో భారీగా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

లక్కీ రాశులివే...

మేషరాశి (Aries) : మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం చాలా కలిసివస్తుంది. కెరీర్‌లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. వ్యాపారవేత్తలు లాభాలను ఆర్జిస్తారు.  ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

వృషభం (Taurus): సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి కెరీర్ కు మాంచి ఊపునిస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల నుండి లాభం పొందుతారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.

సింహం (Leo): సింహ రాశి వారికి సెప్టెంబర్‌లో కెరీర్‌కు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు రాణిస్తారు.  పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడి ద్వారా భారీగా లాభాలను ఆర్జిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది.

కన్య (Virgo): కన్యా రాశి వారికి సెప్టెంబర్‌లో ఆదాయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ఏ శుభ కార్యమైనా చేయవచ్చు. టెన్షన్ తగ్గుతుంది. 

తుల (Libra): తులారాశి వారికి సెప్టెంబర్ నెల చాలా శుభప్రదమైనది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందగలరు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం (Capricorn): సెప్టెంబర్ నెల మకర రాశి వారికి అనేక విజయాలను ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.  వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. పెట్టుబడిు పెట్టడం ద్వారాగా ధనార్జన చేస్తారు. ఈ సమయంలో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 

Also Read: Planet Transits 2022: సెప్టెంబరులో 3 ప్రధాన గ్రహాల సంచారం... ఈ రాశులకు అంతా నష్టమే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News