కొత్త సంవత్సరాదికి ఇంకా కొన్ని రోజులే మిగిలుంది. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాది అంతా బాగుండాలని కోరుకుంటారు. ఏడాదంతా లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించాలని భావిస్తారు. ఇలా జరగాలంటే..కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ ఉపాయాలేంటనేది ఇప్పుడు చూద్దాం.
కొత్త ఏడాది ప్రారంభమైనప్పుడు ఆ ఏడాది అంతా బాగుండాలని, భగవంతుడి కటాక్షం ఉండాలని, ఏడాది అంతా సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా జరగాలంటే కొన్ని ఉపాయాలు పాటించాలని అంటారు జ్యోతిష్యులు. ఇవి పాటిస్తే ఇంట్లో సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. కొత్త ఏడాది తొలిరోజు చేయాల్సిన ఉపాయాల గురించి తెలుసుకుందాం..
కొత్త ఏడాది ఉపాయాలు
కొత్త ఏడాది మొదటిరోజున హనుమంతుడి పూజకు విశేష మహత్యముందని అంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏడాదిలో కనీసం నాలుగుసార్లు హనుమంతుడి వ్రతం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు త్వరగా ప్రసన్నుడై కటాక్షం కురిపిస్తాడు.
కొబ్బరితో చిట్కాలు, మహత్యం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొబ్బరికాయ రెమెడీ ప్రతి వ్యక్తినీ చెడు దృష్టి నుంచి కాపాడుతుంది. కొత్త ఏడాది మొదటి మంగళవారం, గురువారం లేదా శనివారం నాడు ఒక కొబ్బరికాయను మీ కుటుంబసభ్యులపై నుంచి 21 సార్లు దిష్టి తీయాలి. ఆ తరువాత ఆ కొబ్బరికాయను నీళ్లలో వదిలేయాలి. ఇలా ప్రతినెలా లేదా ఏడాదిలో ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతి వ్యక్తి చెడు దృష్టి నుంచి రక్షింపబడతాడు. దోష విముక్తుడౌతాడు.
బ్లాక్ సుర్మా
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొత్త ఏడాది మొదటి రోజు 11 సార్లు కళ్లలో సుర్మా రాసుకోవాలి, దీనివల్ల రోగాలు, దోషం, భయం తొలగిపోతాయి. దాంతోపాటు వ్యక్తుల గ్రహస్థితిలో మెరుగుదల వస్తుంది.
కొత్త ఏడాది మొదటి శనివారం నాడు పేదలు, ఆపన్నులకు తెలుపు లేదా రెండు రంగుల రగ్గులు పంచిపెట్టాలి. దీంతోపాటు స్వెట్టర్, షాల్ వంటివి కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం లభిస్తుంది.
Also read: Sun Transit 2022: 18 రోజులు ఆగితే చాలు.. ఈ ఐదు రాశుల వారికి వద్దన్నా డబ్బు జేబులోకి వస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook