November Zodiac Sign 2024: 2025 సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కేవలం 2 నెలలు మాత్రమే ఉంది. కొత్త సంవత్సరం రాకముందే ఎంతో శక్తివంతమైన కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా నవంబర్ నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. 2024 సంవత్సరం చివరన ఎంతో శక్తివంతమైన కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అదేవిధంగా కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి. దీని కారణంగా ఈ సమయంలో ఏర్పడే ప్రభావం ద్వాదశరాశిల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం చివరిలో ఎంతో శక్తివంతమైన సూర్యుడు, శుక్ర గ్రహాలతో పాటు బుధుడు, గురుడు కూడా తమ స్థానాలను ఒక రాశి నుంచి మరో రాశికి మార్చుకోబోతున్నాయి. దీని కారణంగా ద్వాదశరాశుల్లోని కొన్ని అద్భుతమైన అదృష్టాన్ని పొందుతాయి. అలాగే ఈ సమయంలో మరికొంతమందికి ప్రతికూలంగా కూడా ఉంటుందని జ్యోతిష్యలు చెబుతున్నారు. అయితే నవంబర్ నెలలో గ్రహాలు చేసే రాశి సంచారాల వల్ల ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
గురు గ్రహ సంచారం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుంది. అయితే ఈ గురు గ్రహం 2025 సంవత్సరం మొత్తం వృషభ రాశిలో ఉంటుంది. కానీ ఈ సమయంలో నక్షత్ర సంచారాలు తప్పకుండా చేస్తుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 28వ తేదీన ఈ గ్రహం మృగశిర నక్షత్రంలో నుంచి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. దీనివల్ల వృశ్చిక రాశితో పాటు ధనస్సు, మేషరాశిల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
బుధుడి సంచారం:
గ్రహాలకు రాకుమారుడుగా పిలుచుకునే బుధుడు కూడా ఈ సమయంలో తిరుగమనం చేయబోతున్నాడు. నవంబర్ 26వ తేదీన ఈ గ్రహం వృశ్చిక రాశిలో తిరోగమన కదలికలు జరుపబోతోంది. దీని కారణంగా కర్కాటక రాశి తో పాటు మకర, మీన, కన్యారాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ బుధుడు నవంబర్ 30వ తేదీన వృశ్చిక రాశిలోనే అస్తమించబోతున్నాడు. దీని కారణంగా కూడా ద్వాదశ రాశుల వారిపై అద్భుతమైన ప్రయోజనాలు కలిగే ఎఫెక్ట్ పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందితే.. మరికొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో రిస్క్ గా ఉంటుంది.
శుక్రుడి సంచారం:
శుక్ర గ్రహాలు కూడా అప్పుడప్పుడు ఒకే రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటుంది. అయితే నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి అదృష్టంగా భావించవచ్చు. శుక్రుడ్ని డబ్బు ఆనందం ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు.. కాబట్టి ఈ గ్రహం సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడి వారికి ఆర్థికపరమైన విషయాలను అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అయితే ఈ శుక్రుడి సంచారం వల్ల సింహరాశి తో పాటు తులా, మకర, కుంభరాశుల వారు విశేషమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
సూర్యగ్రహ సంచారం:
సూర్యుడు కూడా ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. దీనివల్ల కూడా కొన్ని రాశుల వారిపై ఎఫెక్ట్ పడుతుంది. అయితే నవంబర్ నెలలో కూడా సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. నవంబర్ 16వ తేదీన ఉదయం ఏడు గంటలకు వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఉద్యోగ వ్యాపార జీవితాల్లో ఎనలేని మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో నిలిచిపోయిన ఎలాంటి పనులైనా ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా గ్రహాలకు రాజు అయిన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహ, ధనస్సు, మకర రాశితో పాటు మేష, వృశ్చిక రాశిల వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.