Lemon & Chilli: చాలామంది ఇళ్లు, దుకాణాల ముందు నిమ్మకాయలు, మిర్చి పడేస్తుంటారు. చెడు దృష్టి నుంచి కాపాడేందుకు ఇలా చేస్తారనేది ఓ విశ్వాసం. కొంతమంది దీన్ని అంధ విశ్వాసమని చెప్పినా..దీని వెనుక కూడా సైన్స్ ఉందంటున్నారు..
ఇండియాలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న సాంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలు, అలవాట్లు చూస్తుంటే..లాజిక్ ఏంటనే సందేహాలు వస్తుంటాయి. చాలామంది ఇళ్ల ముందు, దుకాణాల ముందు నిమ్మకాయలు, మిర్చి పడేస్తుంటారు. కొంతమంది దీన్ని ఓ అంధవిశ్వాసంగా చెబుతుంటారు. కానీ దీని వెనుక ఓ రహస్యం దాగుందని తెలుసా అంటున్నారు ఇంకొందరు.
నిమ్మకాయులు, ఎండి మిర్చి వెనుక లాజిక్ ఇదే
ఇళ్ల వాకిట, దుకాణాలు, కార్యాలయాల ముందు నిమ్మకాయలు, ఎండుమిర్చి విసిరేసి ఉండటం చూస్తుంటాం. చెడు దృష్టి నుంచి రక్షించుకునేందుకే ఇలా చేస్తుంటారు. కొంతమంది దీనికి అంధ విశ్వాసమని కొట్టిపారేసినా..దీని వెనుక సైన్స్ ఉందంటారు ఇంకొందరు. ఆ సైన్స్ ఏంటో చూద్దాం. నిమ్మకాయ చూసిన వెంటనే ఎవరికైనా పులుపుతనం భావన మనసులో కలుగుతుంది. ఫలితంగా చెడుదృష్టితో చూసేవాళ్లు ఎక్కువసేపు అక్కడుండేందుకు ఇష్టపడరు. నిమ్మకాయ నుంచి వెలువడే పులుపుతనం చాలా వేగంగా చెడువాసన కల్గిస్తుంది. అదే విధంగా ఎండుమిర్చిలో ఉండే ఘాటు కూడా ఇందుకు కారణమౌతుంది. అందుకే ఈ రెండడు ఒకేసారి గుమ్మంపై తగిలిస్తుంటారు లేదా ఇంటి ముందు వేస్తుంటారు. ఫలితంగా ఇంటిలోపల దోమలు, ఈగలు కూడా రావు.
సైన్స్ ప్రకారం నిమ్మకాయలు, మిర్చిలో కీటకాల్ని చంపే గుణాలున్నాయి. అందుకే ఈ రెండింటినీ గుమ్మానికి తగిలించడం ద్వారా అక్కడి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. వాస్తుపరంగా కూడా ఇది మంచిదంటున్నారు. వాస్తు ప్రకారమైతే..ఈ రెండింటినీ కలిపి గుమ్మానికి తగిలిస్తే..నెగెటివిటీ దరి చేరదని నమ్మకం. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ భావన కలుగుతుంది. అందుకే వాస్తుశాస్త్రం ఇంట్లో నిమ్మచెట్టు పెంచమని చెబుతుంటుంది.
Also read: Vastu Tips: ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఆ దిక్కున ఉంచితే అదృష్టం మీ తలుపు తడుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook