TSRTC Offer: ఆర్​టీసీ స్పెషల్ ఆఫర్.. వారికి సిటీ బస్సుల్లో ఆ 2 గంటలు ఉచిత ప్రయాణం!

TSRTC Offer: రిజర్వేషన్​తో.. ఆర్​టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి గుడ్​ న్యూస్​. ఇంటి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు బోర్డింగ్ పాయింట్​ వరకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చట!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 07:16 PM IST
  • ఆర్​టీసీ మరో బంపర్ ఆఫర్​
  • సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి వీలు!
  • దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి వెసులుబాటు!
TSRTC Offer: ఆర్​టీసీ స్పెషల్ ఆఫర్.. వారికి సిటీ బస్సుల్లో ఆ 2 గంటలు ఉచిత ప్రయాణం!

TSRTC Offer: తెలంగాణ ఆర్​టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్​ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వినూతన్న నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. టీ-24 టికెట్లు ప్రారంభించడం, జిల్లా కేంద్రాలకు బస్సుల్లో ప్రయాణం చేసి.. సమస్యలు తెలుసుకోవడం వంటి పనులు చేశారు. తాజాగా మరో వినూత్న ఆపర్​తో ముందుకొచ్చారు.

ప్రైవేటు ట్రావెల్స్​కు పోటీగా పని చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్రావెల్ సంస్థలతో పోటీ పడేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక  కొత్త కొత్త ఆపర్లను తీసుకొస్తోంది. దూరపు ప్రయాణాలు చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.

కొత్త ఆఫర్ ఏమిటంటే?

ఆర్​టీసీ బస్సుల్లో దూరపు ప్రయాణాలు చేసే వారికి ఈ ఆఫర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే 250 కిలో మీటర్లు అంతకన్నా ఎక్కువ దూరాలకు ప్రయాణం చేస్తారో.. వారుకి ఇంటి నుంచి బస్సు బోర్డింగ్ పాయింట్స్​ వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.

అంటే.. హైదరాబాద్​ నుంచి 250 కిలో మీటర్ల దూరానికి ప్రయాణ చేస్తే. బస్సు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో అక్కడి వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదే విధంగా 250 కిలో మీటర్లు అంతకన్నా ఎక్కువ దూరం నుంచి టీఎస్​ ఆర్​టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి హైదరాబాద్​ జంటనగరాలకు చేరుకున్నా ఇంటి వద్దకు వెళ్లేందుకు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.

హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసే వారు ప్రయాణానికి 2 గంటల ముందు.. హైదారాబాద్​కు చేరుకున్న తర్వాత 2 గంటల వరకు ఈ సదుపాయం ఉపయోగించుకునే వీలుంది. అయితే ఈ సదుపాయం వినియోగించుకునేందుకు ప్రయాణికులు తాము రిజర్వేషన్ చేసుకున్న బస్సు టికెట్ చూయించాల్సి ఉంటుంది.

Also read: Hyderabad Student: తరగతి గదిలోనే గొడవపడ్డ స్టూడెంట్స్.. ఆరో తరగతి విద్యార్థి మృతి!!

Also read: Niloufer Hospital: విషాదం.. హైదరాబాద్ నీలోఫర్‌లో ఇద్దరు శిశువుల మృతి, మరో చిన్నారి కిడ్నాప్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News