Pancha Yogam effect 2023: ఫిబ్రవరి 19న శష్, జ్యేష్ఠ, శంఖ, సర్వార్థసిద్ధి, కేదార్.. ఐదు యోగాల కలయిక.. ఈ 4 రాశులకు తిరుగులేదు

Pancha Yogam Effect 2023: ఈసారి పంచయోగం ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమైంది. ఈ అరుదైన పంచయోగం 70 ఏళ్ల తర్వాత ఏర్పడింది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అరుదైన పంచయోగం కారణంగా 4 రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 10:26 AM IST
Pancha Yogam effect 2023: ఫిబ్రవరి 19న శష్, జ్యేష్ఠ, శంఖ, సర్వార్థసిద్ధి, కేదార్.. ఐదు యోగాల కలయిక.. ఈ 4 రాశులకు తిరుగులేదు

Effect of Pancha Yog on Zodiac Signs: గ్రహాలు కాలానుగుణంగా తమ కక్ష్యలను మరియు కదలికలను మారుస్తాయని వేద గ్రంధాలలో చెప్పబడింది. అంతేకాకుండా ఇవి ఇతర గ్రహాలతో సంయోగం జరిపి శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఈనెల 19న శష్, జ్యేష్ఠ, శంఖ, సర్వార్థసిద్ధి, కేదార్ అనే ఐదు యోగాల కలయిక ఏర్పడింది. ఈ అరుదైన యాదృచ్చికం ఏడు దశాబ్దాల తర్వాత కనిపిస్తుంది. ఫలితంగా నాలుగు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభ రాశి
ఐదు మహా యోగాల ఈ అరుదైన కలయిక మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. కొత్తగా బిజినెస్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 

సింహరాశి 
మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయిన మీ పని పూర్తవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మీరు తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 

ధనుస్సు రాశి
ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారుల పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. 

మిధునరాశి
ఆఫీసులో సహోద్యోగులు మరియు సీనియర్ల సహకారం లభిస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వివిధ వనరుల ద్వారా డబ్బు సమకూరుతుంది. కుటుంబంతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 

Also Read: Saturn Rise 2023: మార్చి 6 నుండి ఈరాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News