Mangal Shukra yuti 2023: మరికొన్ని గంటల్లో ఈ రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?

Mars Venus Conjunction 2023: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మరియు శుక్రుడు కలయిక మిథునరాశిలో ఏర్పడబోతుంది. దీంతో 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 01:01 PM IST
Mangal Shukra yuti 2023: మరికొన్ని గంటల్లో ఈ రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?

Mangal Shukra yuti 2023: గ్రహాల సంచారపరంగా మే నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో సూర్యుడు, శుక్రడు, అంగారకుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇవాళ మధ్యాహ్నాం శుక్రుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో మే 30 వరకు ఉండనున్నాడు. ఈ నెల 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్న కుజుడు శుక్రుడితో కలవనున్నాడు. అంగారకుడు-శుక్రుడు కలయిక వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

మిథున రాశి : శుక్రుడు-అంగారకుడు సంయోగం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీకు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. 
వృషభ రాశి : కుజుడు-శుక్రుడు మైత్రి కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ బాధ్యత పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 
మేష రాశి : కుజుడు-శుక్రుడు సంచారం కారణంగా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

Also read: Budh-Shukra Yuti 2023: అరుదైన యోగాన్ని చేయబోతున్న బుధుడు-శుక్రుడు.. ప్రత్యేక ప్రయోజనం పొందబోతున్న రాశులివే..

సింహ రాశి: ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు. డబ్బు డబల్ అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులన్నీ మెుదలవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు విస్తరిస్తుంది. 
కన్య రాశి : మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారులు లాభపడతారు. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. కుటుంబంలో సంతోషం తాండవిస్తోంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also read: Chandra Grahan 2023: మరో 3 రోజుల్లో ఈ రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News