Radha Ashtami Worship Method: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు రాధా అష్టమి వ్రతం జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి తర్వాత 15 రోజులకు వస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధ జన్మించిన రోజు. దీనినే మనం రాధాష్టమి (Radha Ashtami) అంటారు. ఈ పండుగను ముఖ్యంగా మధుర, బృందావనం మరియు బర్సానాలలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి రాధాకృష్ణులను పూజిస్తారు.
రాధా చాలీసా పారాయణం
ఈ రోజు రాధాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రాధా చాలీసా పారాయణం పఠించాలి. రాధాష్టమి రోజున రాధకృష్ణలను పూజించడం వల్ల మనిషి జీవితంలో అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు సిద్దిస్తాయి.
శుభ ముహూర్తం
రాధా అష్టమి తేదీ సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10.40 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం, రాధా అష్టమి పండుగ సెప్టెంబర్ 4న జరుపుకుంటారు. ఈ రోజు తెల్లవారుజామున 4:36 నుండి 5.2 గంటల వరకు పూజించడానికి అనుకూలమైన సమయం ఉంటుంది.
ఇలా పూజించండి
ఈ రోజు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలంలో కలశాన్ని ప్రతిష్టించాలి. పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని వేసి రాధా రాణి విగ్రహాన్ని పెట్టండి. వాటికి పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయండి. ఆ దేవతను బట్టలు, అభరణాలు, మేకప్ తో అలకరించండి. రాధా మరియు కృష్ణుడి మంత్రాన్ని జపించి, కథ వినండి లేదా చదవండి. చివరగా హారతి ఇవ్వండి.
Also Read: Mahalaya Amavasya 2022: మహాలయ అమావాస్య ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook