Ramadan 2023 Moon Sighting Time: ఇండియాలో నెలవంక కనిపించేది ఎప్పుడో తెలుసా?

Ramadan 2023 Moon Sighting Time: ఈ సంవత్సరం, భారతదేశంలో రంజాన్ బుధవారం, మార్చి 22, 2023న ప్రారంభమవుతుందని భావిస్తున్నారు, అయితే చంద్రవంక ఎప్పుడు కనిపిస్తుంది? ఇఫ్తార్ సమయాలు ఎప్పుడు అనేది తెలుసుకుందాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 22, 2023, 01:33 PM IST
Ramadan 2023 Moon Sighting Time: ఇండియాలో నెలవంక కనిపించేది ఎప్పుడో తెలుసా?

Ramadan 2023 Moon Sighting Time: రంజాన్ మాసం ముస్లిం మతాన్ని ఫాలో అయ్యే అందరికీ చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ముస్లింలు అందరూ ఈ నెల మొత్తం ప్రజలు ఉపవాసం ఉండి అల్లాను ఆరాధిస్తారు. ఆకాశం నెలవంక దర్శనం తర్వాత రంజాన్ ప్రారంభమవుతుంది. ఈరోజు, మార్చి 21, 2023న, చంద్రుడు కనిపిస్తే, రేపు అంటే మార్చి 22న, రంజాన్ మొదటి రోజు ఉపవాసం మొదలవుతుంది.

మరోవైపు, ఈ రోజు చంద్రుడు కనిపించకపోతే, మార్చి 23 నుంచి రంజాన్ ఉపవాసం మొదలు కానుంది.  కొన్ని కారణాల వల్ల భారతదేశంలో చంద్రుడు కనిపించకపోతే, రంజాన్ ప్రారంభం అలాగే ముగింపు కూడా సౌదీలో చంద్రుని వీక్షణ కమిటీ ద్వారా నిర్ణయించబడుతుంది. చంద్రుని దర్శనం తర్వాత రంజాన్ ఉపవాసం ప్రారంభమవుతుంది, ముస్లింలు అందరూ ఒకరికొకరు 'చాంద్ ముబారక్' లేదా 'రంజాన్ ముబారక్' అని పలకరించుకుంటారు.

రంజాన్ ముఖ్య ఉద్దేశ్యం భక్తిని పెంచడం, అల్లాతో అనుసంధానం అవడం. రంజాన్ రోజుల్లో ఉపవాసం ఉండటం ద్వారా అల్లాను ఆరాధించడం ఇతర రోజుల కంటే 70 రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుందని ముస్లింలు నమ్ముతారు. కానీ గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చాలా చిన్న పిల్లలకు ఉపవాసం నుండి మినహాయింపు ఉంటుంది.

రంజాన్‌ నెలలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ప్రారంభించే ముందు సెహ్రీ చేస్తారు, ఉపవాసాన్ని విరమించడానికి ఇఫ్తార్ చేస్తారు. రంజాన్ మొదటి ఉపవాసం కోసం సెహ్రీ సమయం 04:38 అలాగే ఇఫ్తార్ సమయం 06:20. అయితే ప్రాంతాన్ని బట్టి సెహ్రీ మరియు ఇఫ్తార్ సమయాల్లో కొంచెం తేడా ఉంటుంది.

రాష్ట్రాల వారీగా ఇఫ్తార్ సమయం ఇలా ఉంది:

  • ముంబై - ఉదయం 05:33 నుండి సాయంత్రం 06:49 వరకు
  • ఢిల్లీ - ఉదయం 05:11 నుంచి సాయంత్రం 06:32 వరకు
  • చెన్నై - ఉదయం 05:05 నుండి సాయంత్రం 06:20 వరకు
  • హైదరాబాద్ - ఉదయం 05:11 నుంచి సాయంత్రం 06:29 వరకు
  • బెంగళూరు-ఉదయం 05:16 నుంచి సాయంత్రం 06:34 వరకు
  • అహ్మదాబాద్ - ఉదయం 05:33 నుండి సాయంత్రం 06:50 వరకు
  • కోల్‌కతా - ఉదయం 04:30 నుండి సాయంత్రం 05:47 వరకు
  • పూణె- ఉదయం 05:29 నుంచి సాయంత్రం 06:48 వరకు
  • జైపూర్ - ఉదయం 05:18 నుంచి సాయంత్రం 06:39 వరకు
  • లక్నో - ఉదయం 04:57 నుంచి సాయంత్రం 06:17 వరకు
  • కాన్పూర్ - ఉదయం 05:00 నుంచి సాయంత్రం 06:20 వరకు
  • ఇండోర్ - ఉదయం 05:20 నుంచి సాయంత్రం 06:40 వరకు
  • పాట్నా- ఉదయం 04:41 నుంచి సాయంత్రం 06:00 వరకు
  • చండీగఢ్ - ఉదయం 05:11 నుంచి సాయంత్రం 06:35 వరకు

భారతదేశంలో నెలవంకను మీరు ఎప్పుడు గుర్తించవచ్చు?

క్రెసెంట్ మూన్ వాచ్ ప్రకారం, రంజాన్ అమావాస్య మార్చి 21న 17:23 GMTకి (మక్కా సమయం 8:23 గంటలకు) ప్రారంభమవుతుంది. అయితే ఆ రాత్రి ఏ విధమైన దృశ్యాలు కనిపించలేదని అల్ జజీరా రిపోర్ట్ చేసింది. ఈరోజు  సాయంత్రం 7:19 గంటలకు   చంద్రుడు ఉదయిస్తాడని అంచనా. ఇక  ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం , ఇరాన్, పాకిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా అంతటా ఆకాశం స్పష్టంగా ఉంటే ఆప్టికల్ సహాయం లేకుండా నెలవంకను చూడవచ్చు . చంద్రుడు దర్శనమిస్తే, రంజాన్ మొదటి ఉపవాస దినం మార్చి 23 ఒకవేళ కాకపోతే మొదటి రోజు మార్చి 24 అవుతుంది. 

Also Read: Earthquake Safety Tips: భూకంపం వస్తే ఈ పనులు చేయండి.. లేదంటే రిస్కే!

Also Read: World Water Day 2023: ప్రపంచ నీటి దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News