Budhaditya Yog on Rathasaptami 2024: మాఘమాసంలోని శుక్ల పక్షం ఏడో రోజున రథ సప్తమి జరుపుకుంటారు. దీనినే అచల సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యభగవానుడి ఆరాధన చేస్తారు. ఇది ఫిబ్రవరి 16 నాడు రాబోతుంది. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున బుధాదిత్య యోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం మరియు భరణి నక్షత్రం యొక్క శుభ కలయిక జరగబోతోంది. దీంతో ఐదు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
మకరరాశి
మకర రాశి వారికి బుధాదిత్య యోగం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మిథునరాశి
రథసప్తమి నాడు మిథునరాశి వారికి సూర్యభగవానుడి ఆశీస్సులతోపాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది. దీంతో వీరికి డబ్బుకు లోటు ఉండదు. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు మీకు భారీ లాభాలను ఇస్తాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.
సింహరాశి
రేపటి నుంచి సింహ రాశి వారికి లక్ కలిసి వస్తుంది. వీరు శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. పనిచేసే చోట సహచరుల సపోర్టు లభిస్తుంది.
తుల రాశి
రథసప్తమి తులరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబడులు లాభిస్తాయి. మీరు పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది.
మీనరాశి
మీన రాశి వారికి అచల సప్తమి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు ప్రయోజనం పొందుతారు. మీరు లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Holi 2024 date: ఈ ఏడాది హోలీ ఎప్పుడు? హోలికా దహనం ఎందుకు చేస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter