Paush Month 2022: అతి ముఖ్యమైన మాసాల్లో పుష్య మాసం ఒకటి. ఒక్కో మాసంలో ఒక్కో దేవుని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్య మాసంలో సూర్యభగవానున్ని పూజించడం, అర్ఘ్యం సమర్పించడం హిందూ పురాణాల్లో పూర్వీకులు పేర్కొన్నారు. అయితే ఇదే క్రమంలో సూర్యుడు ఈతరాశుల్లోకి సంచారం చేయడం వల్ల ఖర్మ సమయం ఏర్పడుతుంది ఇది దాదాపు 10 నుంచి 11 రోజుల పాటు ఉంటుంది. ఖర్మ సమయంలో సూర్య భగవానుడి శక్తి తగ్గిపోవడం వల్ల అన్ని అశుభ ఘడియలు మొదలవుతాయి కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
ఈ డిసెంబర్ 16న సూర్యగ్రహణం ధనస్సు రాశిలోకి సంచారం చేయనంది దీంతో అదే రోజు నుంచి ఖర్మ సమయం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ క్రమంలో అన్ని రాశుల వారు తప్పకుండా సూర్య భగవానుని అనుగ్రహం పొందడం చాలా మంచిది. ఖర్మ సమయంలో సూర్య భగవానుడు తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్ల మనుషులకు పాలు రకాల దుష్ప్రభావాలు కలగవచ్చు. కాబట్టి తప్పకుండా సూర్య భగవానున్ని పూజించి అనుగ్రహం పొందడానికి పలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
2022 పుష్య మాస సమయాలు:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. పుష్య మాసం డిసెంబర్ 9న ప్రారంభమై జనవరి 7 వరకు కొనసాగుతుంది. ఈరోజు పుష్య మాసంలోని మొదటి ఆదివారం.. ఈ మాసంలోని మొదటి ఆదివారం రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసినా మంచి ఫలితాలు పొందుతారు.
పుష్య మాస మొదటి ఆదివారం ఇలా చేయండి:
పుష్య మాసం మొదటి ఆదివారం సూర్యభగవానున్ని తప్పకుండా పూజించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడు చిత్రపటానికి ఎర్రటి పూలు సమర్పించి..అర్ఘ్యాన్ని చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఈరోజు సూర్య భగవానుడు కోసం ఉపవాసాలు పాటించి ఆరాధన చేస్తే జీవితంలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అదృష్టం లభిస్తుంది.
పుష్య మాసంలోని మొదటి ఆదివారం లేదా రెండో ఆదివారం రోజున దానధర్మ కార్యక్రమాలు చేస్తే కూడా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వస్త్రాలను, దుప్పట్లను, బెల్లాన్ని నిరుపేదలకు పంచడం వల్ల జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా శుభవార్తలు కూడా ఈ క్రమంలో పొందుతారు.
సూర్య భగవానుడి పూజా కార్యక్రమంలో తప్పకుండా నైవేద్యంగా నువ్వులు బియ్యంతో చేసిన తీపి పదార్థాన్ని పసుపు రంగు దుస్తులను ధరించి సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని పురాణాల్లో పేర్కొన్నారు.
Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook