Remedies for Rahu: రాహు దోషంతో బాధపడుతున్నారా.. నివారణకు ఇదొక్కటే మార్గం!

Remedies for Rahu Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో రాహు చెడు స్థానంలో ఉంటే అష్టధాతువులను ధరించాలి. అంటే అష్టధాతు ఉంగరం లేదా బ్రాస్ లెట్ ధరించవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 04:05 PM IST
  • రాహు దోషంతో బాధపడుతున్నారా
  • ఈ ఉంగరం పెట్టుకుంటే అంతేఇక!
  • నివారణకు ఇదొక్కటే మార్గం!
Remedies for Rahu: రాహు దోషంతో బాధపడుతున్నారా.. నివారణకు ఇదొక్కటే మార్గం!

Remedies for Rahu Dosha, This is only way to escap from Rahu Dosha: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు, కేతువులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా రాహు లోపమున్నట్లయితే వారి జీవితం తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది. కొన్నిసార్లు చేస్తున్న పనిలో వైపల్యం లేదా అనారోగ్యం సంభవించే అవకాశముంది. అంతేకాకుండా కుటుంబానికి దూరమయ్యే ప్రమాదం లేదా మానసికంగా ఒత్తిడి గురవ్వడం లాంటివి జరగవచ్చు. ఎవరి జాతకంలోనైనా రాహు గ్రహం చెడు స్థానంలో ఉన్నట్లయితే.. వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో రాహు చెడు స్థానంలో ఉంటే అష్టధాతువులను ధరించాలి. అంటే అష్టధాతు ఉంగరం లేదా బ్రాస్ లెట్ ధరించవచ్చు. అష్టధాతువు (బంగారం, వెండి, రాగి, సీసం, జింక్, తగరం, ఇనుము మరియు పాదరసం) 8 లోహాల కలయికతో రూపొందించబడుతుంది కాబట్టి అన్ని గ్రహాల స్థితిని సమతుల్యం చేస్తుంది. రత్నాల మాదిరిగానే లోహాలు కూడా గ్రహాలపై చాల ప్రభావం చూపుతాయి. అందుకే రాహు దోషం ఉన్నవారు అష్టధాతు ఉంగరం లేదా బ్రాస్ లెట్ ధరిస్తే.. రాహు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. 

అష్టధాతువును హిందూమతంలో, జైనమతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే దేవుడి విగ్రహం తయారీలో అష్టధాతువులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. రాహువుకు సంబంధించిన దోషాలను తొలగించడంలో అష్టధాతువు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే అష్టధాతువులను నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ధరించాలి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆదాయాన్ని పెంచుకోవాలనుకునే వారు అష్టధాతువులను ధరించవచ్చు. అష్టధాతు ఉంగరం, లాకెట్ లేదా బ్రాస్లెట్ వారికి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది.

ఎవరి జాతకంలోనైనా రాహు గ్రహం చెడు స్థానంలో ఉన్నట్లయితే.. వారు అష్టధాతువులను కుడి చేతికి ధరించాలి. దాంతో రాహువు యొక్క చెడు ప్రభావాల నుంచి ఉపశమనం పొందుతారు. ఒత్తిడి, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు అష్టధాతువులు పెట్టుకోవడం వల్ల మనసు ఏకాగ్రతతో ప్రశాంతంగా ఉంటుంది. వేరే గ్రహాల నివారణ ఉన్నవారు కూడా నిపుణుల సలహాతో అష్టధాతువులతో చేసిన ఉంగరం లేదా కంకణం ధరించవచ్చు.

Also Read: Kohli Dhoni: ఎంఎస్ ధోనీకి విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాల్సిందే.. మహీ పాదాలను తాకాల్సిందే..!

Also Read: Viral Video: పాల కోసం పిల్లి ఎంత పని చేసిందో మీరే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News