Samudrika Shastram: మీ చేతి వేళ్లు చెప్పేస్తాయి మీ భవిష్యత్, మీ మనస్తత్వాల్ని

Samudrika Shastram: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల్లానే సాముద్రిక శాస్త్రం ఒకటి. అంటే చేతి రేఖలే కాదు..చేతి వేళ్ల ఆకారం, నిర్మాణం బట్టి భవిష్యత్ చెప్పవచ్చు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2022, 11:41 PM IST
Samudrika Shastram: మీ చేతి వేళ్లు చెప్పేస్తాయి మీ భవిష్యత్, మీ మనస్తత్వాల్ని

సాముద్రికం కూడా జ్యోతిష్యశాస్త్రంలో ఓ భాగం. సాముద్రికమంటే కేవలం చేతి రేఖల్ని బట్టి భవిష్యత్ చెప్పేదే కాదు..చేతి వేళ్ల నిర్మాణం, ఆకారాన్ని బట్టి వ్యక్తి భవిష్యత్, గుణగణాలు, ప్రత్యేకతలు చెప్పేదే సాముద్రికం. వ్యక్తి చేతి వేళ్ల ఆకారం ఆ వ్యక్తిని వర్ణిస్తుంది. 

ఎవరైనా వ్యక్తి చేతిపై ఉన్న రేఖల్ని బట్టి అతడి అదృష్టం అంచనా వేయవచ్చు. అదే విధంగా అతడి వేళ్ల ఆకారం బట్టి  అతడికి సంబంధించిన రహస్యాలు సులభంగా తెలుసుకోవచ్చు. చేతి రేఖల్లో ఎలాగైతే వ్యక్తి భవిష్యత్ దాగుందో..అదే విధంగా చేతి వేళ్లు కూడా వ్యక్తి గురించి చాలా విషయాలు చెబుతాయి. వేళ్ల ఆకారం, నిర్మాణం ఆ వ్యక్తి చరిత్ర, స్వభావాన్ని, భవిష్యత్‌ను చెబుతాయి.

చిటికెన వేలు

చిటికెన వేలును బట్టి ఆర్థిక పరిస్థితి , బుద్ధి గురించి తెలుస్తుంది. ఈ వేలు ఎంత పొడుగ్గా ఉంటే..ఆ వ్యక్తి అంత తెలివైనవాడవుతాడు. కానీ ఒకవేళ ఈ వేలు వంకరగా లేదా చిన్నగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు తమ నిర్ణయాల కారణంగా చిక్కుకుపోవచ్చు.

ఉంగరం వేలు

ఉంగరం వేలు ఆ వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ఆరోగ్యం, జీవితంలో ఎంత కీర్తి సంపాదిస్తాడనేది తెలుస్తుంది. ఈ వేలు ఎక్కువ పొడుగ్గా ఉంటే ఆ వ్యక్తికి కోపం ఎక్కువని అర్ధం. దుస్సాహసిగా కూడా చేస్తాయి. ఈ వేలు ఒకవేళ మధ్యస్థ ఆకారంలో ఉంటే చాలా మంచిదట. ఒకవేళ ఈ వేలు చూపుడు వేలు కంటే పొడుగ్గా ఉంటే జదీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని అర్ధం

మధ్య వేలు

మధ్య వేలును బట్టి వ్యక్తి సామర్ధ్యం, చదువు, ఉద్యోగాన్ని అంచనా వేయవచ్చు. ఈ వేలు ఎంత పొడుగ్గా, తిన్నగా ఉందో ఆ వ్యక్తి అంత వేగంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుతాడు. కానీ ఒకవేళ ఈ వేలు వంకరగా లేదా లావుగా లేదా ఉంగరం వేలు కంటే చిన్నగా ఉంటే..వ్యక్తి కెరీర్ అంతా చిక్కుల్లో ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ వేలిపై పుట్టుమచ్చ ఉంటే..ఆ వ్యక్తికి సమస్యలు చుట్టుముడతాయి.

చూపుడు వేలు

చూపుడు వేలుని అన్నింటికంటే శక్తివంతమైందిగా చెబుతారు. ఈ వేలితో మొక్కలు, పళ్లు, చెట్లవైపు చూపిస్తే..అవన్నీ పాడైపోతాయి. ఈ వేలితో బ్రష్ చేయడం కూడా నిషిధ్దం. ఎందుకంటే ఇది శక్తివంతమైన వేలు. ఈ వేలితో బ్రష్ చేయడం వల్ల పళ్లలో సమస్యలొస్తాయి. ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడో తెలుస్తుంది. 

Also read: Dhanteras Significance: దంతేరస్ నాడు ఆ వస్తువు తప్పకుండా కొనాల్సిందే, అలా చేస్తే ఏమౌతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News