Saturn Retrograde 2023: బలోపేతమైన శని, ఇవాళ్టి నుంచి ఆ 3 రాశులకు లెక్కలేనంత డబ్బు

Saturn Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహత్యం, ప్రాశస్త్యత ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అందుకే శని అంటే చాలామంది భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2023, 07:36 AM IST
Saturn Retrograde 2023: బలోపేతమైన శని, ఇవాళ్టి నుంచి ఆ 3 రాశులకు లెక్కలేనంత డబ్బు

Saturn Retrograde 2023: జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన గ్రహంగా భావిస్తకారు. శని గ్రహం ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంపై కచ్చితంగా పడటం వల్ల శనిగ్రహం కదలికలపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంటుంది. శని గ్రహం ప్రభావంతో ఆ మూడు రాశులకు అద్బుతమైన లాభాలు కలగనున్నాయట. అందులో మీ రాశి ఉందా లేదా..

ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో వక్రమార్గంలో ఉండటమే కాకుండా ఇవాళ్టి నుంచి మరింత శక్తిమంతుడిగా మారనున్నాడు. శని గ్రహాన్ని హిందూమతం ప్రకారం ఆయవు, దుఖం, రోగం, జ్ఞానం, సాంకేతికత, ఇనుము,ఆయిల్ ఇంకా ఇతరత్రా అంశాలకు కారకుడిగా భావిస్తారు. అందుకే శని గ్రహం కదలికలో ఏ చిన్న మార్పు వచ్చినా కీలకమన పరిణామాలు సంభవిస్తాయంటారు. 2023 జూన్ 17 నుంచి శని తన రాశి అయిన కుంభంలో వక్రమార్గంలో ఉంది. ఇవాళ అంటే ఆగస్టు 29వ తేదీన శుక్ర గ్రహం వక్రావస్థలో శక్తిమంతుడిగా మారి పరిభ్రమించడం ప్రారంభిస్తుంది. శని బలం పెరగడంతో సహజంగానే ఆ ప్రభావం ఇతర రాశులపై పడుతుంది. ముఖ్యంగా 3 రాశులకు అదృష్టం తిరగరాయనుంది. ఉద్యోగం, వ్యాపారం రెండూ అద్భుతంగా ఉంటాయి. ఊహించని లాభాలు వచ్చి పడతాయి. నలుగురిలో గౌరవం పెరుగుతుంది. ఎక్కడ అడుగుపెట్టినా విజయం మీదే అవుతుంది.

మిధున రాశి జాతకులకు శనిగ్రహం ద్వారా ఇవాళ్టి నుంచి ఊహించని లెక్కలేనన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. ఎప్పట్నించో ఉన్న కోర్కెలు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇంట్లో తండ్రి ఆరోగ్యం మెరుగుపడటంతో మీకు చాలా వరకూ రిలీఫ్ లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇక తులా రాశి జాతకులకు శని గ్రహం వక్రమార్గంలో పయనించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంంధించి శుభవార్త వినవచ్చు. ఊహించని మార్గం నుంచి ధనలాభం కలుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అమాంతంగా పెరిగిపోతుంది. వివాదాస్పద అంశం మీకు అనుకూలంగా మారవచ్చు. ఈ సమయంలో దీర్ఘకాలిక రోగాల్నించి విముక్తి పొందుతారు. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అనుకూలమైన సమయం కావడంతో ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. జీవితంలో ప్రశాంతత లభిస్తుంది.

వృషభ రాశి జాతకులు శని గ్రహం వక్రమార్గం కారణంగా అత్యంత ప్రభావితులౌతారు. ఈ రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అంతులేని ధన సంపదలు లభిస్తాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో పెద్దఎత్తున లాభాలు ఆర్జిస్తారు. ఏ పని చేపట్టినా అదృష్టంగా తోడుగా నిలుస్తుంది.

Also read: IRCTC Package: ఐఆర్సీటీసీ నుంచి కొత్త ప్యాకేజ్, 14 వేలకే ప్రమఖ ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన, 8 రోజుల టూర్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News