Shani Vakri 2023: 139 రోజులపాటు రివర్స్ లో కదలనున్న శని.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్...

Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. శని యెుక్క ఈ రివర్స్ కదలిక కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 03:51 PM IST
Shani Vakri 2023: 139 రోజులపాటు రివర్స్ లో కదలనున్న శని.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్...

Shani Vakri Effect 2023: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. ఇతడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు జూన్ 05న కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శనిగ్రహం 139 రోజుల పాటు రివర్స్ లో కదలనున్నాడు. శని వక్రీ మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి
శని తిరోగమనం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి యెుక్క మూడో ఇంట్లో శని సంచరించబోతున్నాడు. దీని కారణంగా శని శక్తివంతం కానున్నాడు. శని మీ రాశి యెుక్క 12వ ఇంటికి అధిపతి. దీని కారణంగా మీలో దైర్యం పెరగనుంది. విదేశాలతో సంబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. 
తుల రాశి
శని దేవుడి వ్యతిరేక కదలిక తులారాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో శని తిరోగమనం చేయబోతుంది. శని ఈ ఇంట్లో 139 రోజులు ఉండబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందనున్నారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. తులారాశి యెుక్క నాల్గవ ఇంటికి శనిదేవుడు అధిపతి. దీని కారణంగా మీకు స్థిర చరాస్తులు కలిసి వస్తాయి.   
మిధునరాశి
శనిదేవుని వక్రీ మిథునరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. శని మీ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఫారిన్ ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది. మీకు కోరుకున్న జాబ్ లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 

Also Read: Budh Uday 2023: ఉదయించబోతున్న గ్రహాల యువరాజు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News