Shani Uday in Kumbha Rashi 2024: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల గమనంలో మార్పు కొన్ని రాశులవారికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. ఆస్ట్రాలజీలో శని గ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. శని అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. శని వక్ర దృష్టి పడిందంటే బిలియనీర్ కూడా బిచ్చగాడిగా మారుతాడు. మార్చి 18న శనిగ్రహం కుంభరాశిలో ఉదయించబోతుంది. శని గ్రహోదయం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
కుంభరాశి
ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇందులో శనిదేవుడు ఉదయించబోతున్నాడు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. భార్యభర్తల మంచి రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు.
మేష రాశి
శని ఉదయించడం వల్ల మేషరాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. జాబ్ కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
కన్యా రాశి
శని కదలికలో మార్పు కన్యా రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చే అవకాశం ఉంది. ఆఫీసులో జాబ్ చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Shani dev: త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు బంపర్ ఆఫర్..
Also Read: Grah yuti in March 2024: ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన బుధుడు-రాహువు.. ఈ 4 రాశులకు ఎన్నడూ చూడనంత డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి