Shani dev: త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు బంపర్ ఆఫర్..

Astrology Updates: కర్మఫలదాత అయిన శని త్వరలో తన నక్షత్ర గమనాన్ని మార్చనున్నాడు. దీని కారణంగా కొందరి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 10, 2024, 09:16 PM IST
Shani dev: త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు బంపర్ ఆఫర్..

Shani Nakshtra Transit 2024: పురాణాల ప్రకారం, సూర్యదేవుడు పుత్రుడు శనిదేవుడు. ఇతడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని వక్రదృష్టి పడిందంటే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడు కర్మఫలదాత అని పిలుస్తారు. త్వరలో శనిదేవుడు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఏప్రిల్ 07న శని గ్రహం శతభిషా నక్షత్రాన్ని విడిచిపెట్టి పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతుంది. పూర్వాభాద్రపద నక్షత్రానికి అధిపతి గురుడు. శనిదేవుడి నక్షత్ర రాశి మార్పు వల్ల మూడు రాశులవారి జీవితాలు మారబోతున్నాయి. వీరు ఎన్నడూ చూడని సంపదను చూడబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృషభరాశి
వృషభరాశి వారికి పూర్వాభాద్రపద నక్షత్రంలోకి శని చాలా లాభాలను ఇస్తుంది. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి.
మిథున రాశి
శని కదలికలో మార్పు మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు కోరుకున్న ధనాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మీరు చదువు లేదా బిజినెస్ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
మేష రాశి
శనిదేవుడు నక్షత్ర సంచారం వల్ల మేషరాశి వారు జీవితంలో గొప్పస్థాయికి ఎదుగుతారు. మీ కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి నుంచి లైఫ్ ను సరికొత్త కోణంలో చూడటం మెుదలుపెడతారు. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితిలో ఎదుగుదల ఉంటుంది. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chandra Grahan 2024 effect: హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు పట్టనున్న దరిద్రం..

Also Read: Sun Transit 2024: శని రాశి కుంభం నుంచి సూర్యుడు కదలికలు..ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News