Shani Dev: శనిదేవుడి గమనంలో మార్పు.. ఈ 3 రాశులవారికి ఏడాది అంతా డబ్బే డబ్బు..

Shani Dev: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు గమనంలో మార్పు అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కొత్త ఏడాదిలో మూడు రాశులవారు శని సడేసతి మరియు ధైయా నుండి బయటపడతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 02:38 PM IST
Shani Dev: శనిదేవుడి గమనంలో మార్పు.. ఈ 3 రాశులవారికి ఏడాది అంతా డబ్బే డబ్బు..

Shani Dev Gochar 2023: మన కర్మల ప్రకారం ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు.  మనం మంచి పనులు చేసే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే అశుభఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. అయితే ఏ వ్యక్తిపై శని వక్రదృష్టి పడుతుందో వారు తక్కువ టైంలోనే సర్వనాశనమవుతారు. శనిదేవుడి రాశిమార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో ఉన్నాడు. జనవరి 17, 2023 రాత్రి 08:02 గంటలకు శని మకరరాశి నుండి కుంభరాశిలోకి (Saturn transit in Aquarius 2023) ప్రవేశిస్తాడు. సాధారణంగా శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. శనిగ్రహం ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. కొత్త సంవత్సరంలో శని గమనంలో మార్పు కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందుతారు. మరికొన్ని రాశులవారు శని సడేసతి మరియు ధైయా నుండి విముక్తి లభిస్తుంది. 

ఒక వ్యక్తి యొక్క పనిలో నిరంతర అడ్డంకులు ఏర్పడితే వారు శని సడేసతితో బాధపడుతున్నారని అర్థం. శని యెుక్క సడేసతి ఏడున్నరేళ్లు ఉంటుంది. దీని నుండి 2023లో చాలా మందికి విముక్తి లభిస్తుంది. కుంభరాశిలో శని సంచారం వల్ల మిథునం, తుల మరియు ధనుస్సు రాశులవారికి సడేసతి నుండి బయటపడతారు. కాబట్టి వీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Sankranti Festival: 2023లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ విశిష్టత ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News