Shani Asta In Kumbh 2023: న్యాయదేవుడైన శనిదేవుడు 2023 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 17న కుంభరాశిలో సంచరించనున్నాడు. దీని తర్వాత శనిదేవుడు అదే గ్రహంలో ఫిబ్రవరి 3న (Shani Asta In Kumbh Rashi) ఆస్తమించనున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా ముఖ్యంగా మూడు రాశులవారు ఆర్థికంగా ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మకరం (Capricorn): శనిదేవుడు ఈరాశి యెుక్క రెండో ఇంట్లో అస్తమించనున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలను గడిస్తారు. మకరరాశికి అధిపతి శనిదేవుడు. అందుకే ఈ రాశివారికి శనిదేవుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది.
తుల (Libra): శని దేవుడి మీ జాతకంలో ఐదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అదే విధంగా మీరు ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మెుత్తానికి శని సంచారం మీకు కలిసి వస్తుంది.
వృషభం (Taurus): కుంభరాశిలో శని దేవుడి సంచారం మీకు అనేక లాభాలను ఇస్తుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి పదవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Rahu ketu: స్వరభానుడు రాహు-కేతువులతో ఈ సంబంధాన్ని కలిగి ఉన్నాడు.. అదేంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook