Shani Dev: ఆ రాశిలోనే శని గ్రహం రెండున్నర సంవత్సరాల పాటు.. ఈ రాశులవారు జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతి..

Shani Dev Chalisa: శని గ్రహ సంచారం వల్ల మూడు రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సంచారం వల్ల మరికొన్ని రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం మంచిది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 09:32 PM IST
  • కుంభరాశిలోకి సంచారం శని గ్రహ సంచారం..
  • ఈ 2 రాశువారు 5 రకాల జాగ్రత్తలు పాటించాలి.
  • లేదంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
Shani Dev: ఆ రాశిలోనే శని గ్రహం రెండున్నర సంవత్సరాల పాటు.. ఈ రాశులవారు జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతి..

Shani Dev Chalisa: రాశి సంచారం వల్ల మనిషి జీవితాల్లో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా శని గ్రహం సంతానం వల్ల తీవ్ర మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శని గ్రహం జనవరి 17న కుంభరాశిలోకి సంచారం చేయబోతుంది. ఈ సంచారం ప్రభావం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉండే అవకాశాలున్నాయి. మకర రాశిలో ఉన్న శని గ్రహం ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల మిధున, తులా రాశి వారు అనుభవిస్తున్న ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశుల వారు శని దేవుని అనుగ్రహం పొందేందుకు పలు నివారణలు చేయాల్సి ఉంటుంది. ఏయే రాశుల వారు ఎలాంటి నివారణలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శని శని ఎందుకు ఉంటుందో తెలుసా?

పలు రాశుల వారికి శని సడే సతి దశ ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాశుల వారు కొన్ని ప్రత్యేక నివారణలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురయ్యే  ఛాన్స్ ఉంది. ఈ నివారణలు పాటించడం వల్ల శని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు.

కర్కాటక, వృశ్చిక రాశిల వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి:
ఈ రాశుల వారికి శని గ్రహం సంచారం వల్ల వారి జీవితాల్లో పలు మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు ఈ సంచార క్రమంలో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని.. అదే లక్ష్యం దిశగా పరిగెత్తడం మంచిది. ఈ రాశుల వారు కష్టపడడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంచారం ప్రభావం వల్ల వీరు ఇతరులపై కుట్రలు చేయడం వల్ల ఆ కుట్రల ప్రభావం మీ పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రాశుల వారు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రెండు వారు ఆరోగ్యంగా ఉండేందుకు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా ఇతరుల పట్ల స్నేహభావంతో మెదలడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచార ప్రభావం వల్ల వీరి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పై విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఈ రాశుల వారు శని దేవుడి అనుగ్రహం కోసం ఇలా చేయండి:
1. సుందరకాండ మంత్రాన్ని పఠించండి.
2. ఆవాల నూనెతో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాల్సి ఉంటుంది. 
3.వీలైతే వికలాంగులకు దాన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

Also Read: Rohit Sharma: రోహిత్‌ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో

Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News