Shani Dev Effects In Telugu: శని గ్రహ కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాన్ని న్యాయగ్రహంగా పరిగణిస్తారు. ఇది రాశి సంచారం చేసిన సమయంలో వ్యక్తుల కర్మల బట్టి ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమన దశలో ఉంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 18 వ తేదీన నక్షత్ర సంచారం కూడా చేసింది. ఈ గ్రహం రాత్రి 10 గంటలకు పూర్వభద్రపాద నక్షత్రంలోకి సంచారం చేసింది. ఇది అక్టోబర్ మూడో తేదీ వరకు అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రాన్ని బృహస్పతి నక్షత్రంగా పరిగణిస్తారు. అయితే ఈ నక్షత్రం లోకి సంచారం చేయడం కారణంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి:
శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలో సంచారం చేయడం కారణంగా మొదట ఈ వృశ్చిక రాశి వారిపై శుభ ప్రభావం పడుతుంది. దీనికి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా జరగలేని పనులు కూడా వెంటనే జరుగుతాయి. అలాగే నిలిచిపోయిన డబ్బు కూడా వెంటనే తిరిగి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంపాదనలో అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం శుభప్రదంగా ఉండడమే కాకుండా బోలెడు లాభాలను అందిస్తుంది.
కుంభరాశి:
ఈ నక్షత్రంలోకి శని సంచారం చేయడం కారణంగా కుంభ రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తులు లభించడమే కాకుండా వారి అనుగ్రహం లభించి మంచి అదృష్టాన్ని పొందుతారు. అలాగే శని అనుగ్రహం వల్ల వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా శని పూర్వ పూర్వ భాద్రపద నక్షత్రంలో సంచారం చేయడం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు న్యాయపరమైన చిక్కుల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఈ సమయంలో సులభంగా తిరిగి వస్తాయి. మీరు ఎలాంటి పనులు చేసిన అఖండ విజయాలు సాధించే శక్తిని పొందుతారు. అలాగే ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.