Shani Dev Aarti: శనివారం శని దేవుడిని కొలవడం ఆనవాయితిగా వస్తోంది. శని దేవుడు మనుషుకు వారు చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని దేవుడిని న్యాయదేవతగా చెబుతారు. అయితే శని దేవుడి మంచి ప్రభావం ఉంటే బిక్షాటన చేసేవారు కూడా ధనవంతులవుతారు. సాధరణ వ్యక్తులకు శని దేవుడి అనుగ్రహం లభిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే శని దేవుడి చెడు ప్రభావంతో బాధపడేవారు శనివారం ఈ చిట్కాలు పాటిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
శనివారం ఈ చర్యలతో శని చెడు ప్రభావం మాయం!
శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేవలం శని దేవుడికి ఇష్టమైన వస్తువులను మాత్రమే దానం చేయాల్సి ఉంటుంది. శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..నల్ల నువ్వులు, నల్ల గొడుగులు, నల్ల బూట్లు, నల్లని బట్టలను దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా ప్రతి శనివారం ఆవాల నూనెతో శని దేవుడికి అభిషేకం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో పాటు వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శని దేవుడికి కాంస్య గిన్నెలో ఆవాల నూనె నింపి మీ ముఖం నీడను ఆవాల నూనెలో చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గిన్నెను శని దేవుడి గుడిలో దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చెడు దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
శనివారం శని ఆలయంలో ఇనుప త్రిశూలాన్ని దానం చేయండి. ఇలా దానం చేయడం వల్ల సులభంగా జీవితంలో కష్టాలు దూరమవుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
శనివారం రోజు శని దేవాలయాని వెళ్లి ఉరద్ పప్పుతో చేసిన కిచడీని పంచడం వల్ల చాలా శని చెడు ప్రభావం తొలగిపోతుంది. అంతేకాకుండా శని దోషం కూడా సులభంగా తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇది 10 శని వారాల పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం
Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook