Remedies for Shani Dev: శని దేవుడి చెడు ప్రభావం నుంచి ఇలా 23 రోజుల్లో బయట పడొచ్చు..

Remedies for Shani Dev: శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాకులకు ఆహారంగా విత్తనాలను సమర్పించాల్సి ఉంటుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 03:24 PM IST
  • శని దేవుడి చెడు ప్రభావం నుంచి ఉపశమనం..
  • పొందడానికి ప్రతి రోజూ ఉసిరి చెట్టు..
  • కింద దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.
Remedies for Shani Dev: శని దేవుడి చెడు ప్రభావం నుంచి ఇలా 23 రోజుల్లో బయట పడొచ్చు..

Remedies for Shani Dev: శని దేవుడి హిందూ పురణాల్లో మంచి ప్రాముఖ్యతను ఇచ్చారు. మనుషులు చేసే పనులను బట్టి  ఫలాలు ఇస్తారని శాస్త్రం పేర్కొంది. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక సమయంలో శని దశ ఖచ్చితం వస్తూ ఉంటుంది. అయితే ఈ దశలో భాగంగా రాశులు బలహీనంగా ఉంటే.. ఆ రాశుల వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా పలు రకాల మార్పులు కూడా సంభవించవచ్చు. అయితే ఈ క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే శని పరిష్కరానికి  పలు రకాల చర్యలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ చర్యాల వల్ల శని దేవుడు శాంతించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.  అయితే దీని కోసం ఎలాంటి నివరాణలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శనిదేవుని నివారణలు:
>>శనిదేవుని అగ్రం నుంచి ఉపశమనం పొందడానికి ఈ నివారణలు తప్పకుండా పాటించాలి.  అయితే దీని కోసం మీరు ప్రతి శనివారం శని స్తోత్రాన్ని పఠించాలి. అంతేకాకుండా శని బలపడటానికి.. కుడి చేతి మధ్య వేలికి ఇనుప ఉంగరాన్ని ధరించాలి. అయితే తప్పకుండా ఈ ఉంగరాన్ని గుర్రపు డెక్కతో చేయించాల్సి ఉంటుంది.

>>శని నుంచి ఉపశమనం పొందడానికి శుక్రవారం రాత్రి వంటగదిలో నల్ల శనగలను నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత బొగ్గు, ఇనుప కడ్డీ, శనగలను నల్ల గుడ్డలో కట్టి నీటిలో వదలండి. ఏడాది పాటు ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

నల్ల కుక్కకి బ్రెడ్ తినిపించండి:
>>శని దశ నుంచి బయటపడటానికి..నల్ల కుక్కకు ఆవాల నూనెతో రోటీలను కాల్చీ తినిపించాలి. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి.
>>శనివారం రోజున 19 మంది చేతులకు పొడవాటి నల్లటి దారాన్ని కట్టాలి.  అంతేకాకుండా మీ మెడలో ఆ మాల ధరించండి. వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.

శని మహాదశ కోసం ఈ పరిహారాలు చేయండి:
>>శని మహాదశ నుంచి విముక్తి పొందడానికి.. ప్రతి శనివారం ఉసిరి చెట్టు క్రింద నాలుగు ముఖాల దీపాన్ని చేసి ఆవనూనెతో వెలిగించండి. ఆ తర్వాత చెట్టుకు కనీసం మూడు సార్లు ప్రదక్షిణ చేయండి.
>>శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం లేదా వీలైతే ప్రతిరోజూ కాకులకు ఆహారంగా ధాన్యాన్ని వేయండి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌

Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News