Vipreet Rajyog: 'విపరీత రాజయోగం' చేస్తున్న శనిదేవుడు.. ఈ రాశులవారికి వ్యాపార, ఉద్యోగాల్లో భారీగా లాభం..

Vipreet Rajyog: 2023 జనవరిలో శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత వ్యతిరేక రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 05:26 PM IST
Vipreet Rajyog: 'విపరీత రాజయోగం' చేస్తున్న శనిదేవుడు.. ఈ రాశులవారికి వ్యాపార, ఉద్యోగాల్లో భారీగా లాభం..

Vipreet Rajyog Positive Impact: ఆస్ట్రాలజీలో కొన్ని రాజయోగాలు నేరుగా ప్రయోజనాలను ఇవ్వవు. అలాంటి యోగాల్లో విపరీత రాజయోగం ఒకటి. వచ్చే ఏడాది జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా వ్యతిరేక రాజయోగం (Vipreet Rajyog) ఏర్పడుతుంది. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. 2023లో ఏర్పడనున్న ఈ రాజయోగం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి యెుక్క ఎనిమిదో ఇంటికి శనిదేవుడు అధిపతి. విపరీత రాజయోగం వల్ల మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతిని పొందుతారు. ఉద్యోగులు పదోన్నతి లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థికంగా లాభపడతారు. 
కన్యారాశి (Virgo): కుంభరాశిలో శని సంచారం కన్యా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క ఆరో ఇంటికి శనిదేవుడు అధిపతి. మీరు కష్టపడి అనేక విజయాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గెలుపొందుతారు. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారికి 2023లో శనిగ్రహం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీ రాశికి మూడవ ఇంటికి శని అధిపతి. ధనుస్సు రాశి వారు శని సాడే సతి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యతిరేక రాజయోగం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వ్యాపారంలో మీకు భారీగా లాభాలను ఆర్జిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందుతారు. 
మీన రాశి (Pisces): మీనరాశికి పన్నెండవ ఇంటికి శని అధిపతి. 2023లో శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు... మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. అంకితభావంతో పనిచేసే వారికి శనిదేవుడు మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి నుండి లాభం పొందుతారు. 

Also Read: Mercury Vakri 2023: కొత్త ఏడాదిలో తిరోగమనంలో బుధుడు.. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News