Shani Gochar 2023: మకర రాశిని నుంచి కుంభ రాశిలోకి శని గ్రహం.. ఈ రాశులవారికి ఊహించని లాభాలే..లాభాలు..

Shani Gochar 2023: శని గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు కొన్ని రాశులవారు ఊహించని లాభాలు కూడా పొందుతారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 10:06 AM IST
Shani Gochar 2023: మకర రాశిని నుంచి కుంభ రాశిలోకి శని గ్రహం.. ఈ రాశులవారికి ఊహించని లాభాలే..లాభాలు..

Shani Gochar 2023 to 2025: జ్యోతిష్య శాస్త్రంలో శని, ఇతర గ్రహాలకు చాలా ప్రముఖ్యత ఉంది. శాస్త్ర నిపుణులు శని గ్రహాన్ని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే కర్మ ఫలితాలను బట్టి శని ఫలితాలు ఇస్తాడు. దీంతో మనిషి జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి. అయితే ఈ గ్రహం ఈరోజు రాత్రి 8:02 గంటలకు మకరరాశి నుంచి కుంభ రాశిలోకి  సంచారం చేయనుంది. అయితే ఈ సంచారం వల్ల చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు రావొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశి సంచారం వల్ల పలు రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగం, వివాహం, ప్రేమ, పిల్లలు, విద్య జీవితంలో పలు మార్పులు వచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే శని గ్రహ సంచారం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారి జీవితంలో మార్పులు:
మేష రాశి:

శని సంచారం వల్ల మేష రాశి వారికి ఆదాయంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఈ క్రమంలో వీరు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని గ్రహం సంచారం వల్ల ఉద్యోగం, వ్యాపారాలు రెండింటిలో కీలక మార్పులు జరిగి.. ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ - ఇంక్రిమెంట్ లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారు.

మిథునం:
మిథున రాశివానికి ఉద్యోగంలో మార్పు చేర్పులు కలుగుతాయి. అంతేకాకుండా వీరు కష్టపడి పనులు చేయడం వల్ల అధిక మొత్తంలో లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ సంచారం వల్ల అప్పులు తగ్గి ఆదాయం కూడా పెరిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

తుల:
ఈ రాశివారు విద్యార్థి దశలో ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న భాగస్వామితో కూడా వివాహం జరిగే ఛాన్స్‌ ఉంది. భవిష్యత్‌లో విజయాలు సాధించడానికి ఈ సంచారం ప్రభావవంతంగా సహాయపడుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Virat Kohli: సచిన్ రెండు రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. చరిత్రలో తొలి ఆటగాడిగా.. 

Also Read: Loan on Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం 4.78 లక్షల లన్ ఇస్తోందా ? ఇది నిజమేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News