Shani Margi Horoscope Rashifal Future Predictions: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శని దేవుడు కర్మ ఫలితాలను బట్టి శుభ, అశుభ ఫలితాలను చూపుతాడు. అంతేకాకుండా శని గ్రహానికి కూడా ఇదే ప్రాముఖ్యత ఉందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.. శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసినప్పుడు వ్యక్తుల జాతకాలపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యక్తుల జాతకాల్లో శని గ్రహం అనుకూల స్థానంలో ఉంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే శని గ్రహం నవంబర్ 3 తేదీన తిరోగమన స్థితిలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మిథున రాశి:
ఈ రాశి వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. నవంబర్ మూడో తేదీ నుంచి రాశివారికి ఆర్థికంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి అంతేకాకుండా ఖర్చులు తగ్గి పొదుపు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
సింహరాశి:
సింహ రాశి వారికి నవంబర్ 3 తేదీ నుంచి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించి..కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈ రాశి వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
కన్యారాశి:
శని గ్రహం తీరుగమనం కారణంగా కన్యా రాశి వారికి ఆర్థికంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. వీరు వాహనంతో పాటు లగ్జరీ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా శని దేవుడి ఆశీస్సులు లభించి కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి