Shukra Gochar 2022: కన్యారాశిలోకి శుక్రుడు.. శనిదేవుడి అనుగ్రహంతో ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!

Shukra Gochar 2022: రేపు శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా ఇది శనివారం వస్తుంది. కాబట్టి ఈరోజున శనిదేవుడిని పూజిస్తారు. వీరిద్దరూ మిత్రులు. శని, శుక్రల అనుగ్రహం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 07:32 AM IST
Shukra Gochar 2022: కన్యారాశిలోకి శుక్రుడు.. శనిదేవుడి అనుగ్రహంతో ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!

Shukra Gochar 2022: ఆనందం, అందం, ప్రేమ, శృంగారం, ఐశ్వర్యానికి కారకుడు శుక్రుడు. రేపు శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబరు 24, శనివారం నాడు శుక్రుడు కన్యారాశిలోకి (Venus transit in virgo 2022) ప్రవేశించనున్నాడు. శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది. పైగా శుక్రుడు, శనిదేవుడు మిత్రులు. ఈ నేపథ్యంలో కొన్ని రాశులవారిపై శని, శుక్రుల శుభ దృష్టి ఉంటుంది. కన్యారాశిలో శుక్రుడు 23రోజులపాటు ఉంటాడు. రాబోయే 23 రోజులు ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

1. తుల రాశి (Libra)- తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు. శని శుక్రుడికి మిత్రుడు. దీంతో ఈ రాశివారికి శుక్ర, శని గ్రహాల అనుగ్రహం ఉంటుంది. ప్రస్తుతం తుల రాశివారిపై శని దైయా కొనసాగుతోంది. దీని కారణంగా వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. 

2. మకరరాశి (Capricorn)- మకర రాశిని శని దేవుడే పరిపాలిస్తాడు. ఈ రాశిపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది. శుక్రుడితో శని దేవుడి మిత్రత్వం కారణంగా  ఈ రాశివారిపై శుక్రుడి అనుగ్రహం ఉంటుంది. ప్రస్తుతం మకరరాశిపై శని సడే సతి కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ రాశిలోనే శని తిరోగమనంలో ఉన్నాడు. 

3. కుంభం (Aquarius)- కుంభ రాశి వారిపై శుక్ర, శని అనుగ్రహం ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశి వారికి శని సడే సతి కొనసాగుతోంది. శనిగ్రహం 2022 ఏప్రిల్ 29న మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించింది.

Also Read: Kartik Amavasya 2022: కార్తీక అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News