Surya Grahan 2022 Date: సూర్య గ్రహణం మరో పదిరోజులుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణమది. ఇదొక సైన్స్ ప్రక్రియ అయినా హైందవం ప్రకారం గ్రహణ సమయానికి ప్రాధాన్యత ఉంది. అదేంటో తెలుసుకుందాం.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే...సూర్యుని చుట్టూ తిరుగుతాడు. అటు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఇది సైన్స్. ఈ క్రమంలో భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ ప్రాంతాన్ని బట్టి సంపూర్ణ లేదా పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సైన్స్ ప్రకారం ఖగోళంలో నిత్యం జరిగే ప్రక్రియే అయినా..హైందవంలో మాత్రం గ్రహణంపై కొన్ని నమ్మకాలున్నాయి. కొన్ని అభిప్రాయాలున్నాయి.
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుంది. అంటే మరో పదిరోజులుంది. గ్రహణాల్ని సాధారణంగా హిందూవులు అశుభసూచకంగా భావిస్తుంటారు. అందుకే ఆ సమయంలో ప్రత్యేక పూజలు, పరిహారాలు ఉంటుంటాయి. సూర్య గ్రహణం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో అనేది పురాణాలు, శాస్త్రాలు చెబుతుంటాయి. మన దేశంలో సూర్యగ్రహం మద్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఇండియాలో ఈ తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది. పూర్తిగా కన్పించేది మాత్రం దక్షిణ, పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికా ప్రాంతాలున్నాయి.
సూర్యగ్రహణ సమయంలో నిషేధిత పనులు ఇవే
సూర్య గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. గ్రహమ సమయంలో ప్రతికూల శక్తి ఉంటుందనేది ఓ నమ్మకం. ఈ శక్తి ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే..సాధ్యమైనంత ఎక్కువగా పూజలు చేయాలి. ఇక గ్రహణ కాలంలో గర్భిణీ మహిళలకు ప్రత్యేకమైన సూచనలున్నాయి. ఏ విధమైన పదునైన వస్తువులు వాడకూడదు. ఇక గ్రహణ కాలంలో ప్రయాణాలు మానేయాలి. ఇది మంచిది కాదని ఓ నమ్మకం. ఈ నిషేధిత పనులన్నీ మత విశ్వాసం, నమ్మకంపై ఆధారపడి ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook