Somvati Amavasya 2022: ఇవాళే సోమవతి అమావాస్య... పితృ దోషం పోవాలంటే ఈ పనులు చేయండి!

Somvati Amavasya 2022: మే 30, సోమవారం చాలా విషయాల్లో చాలా ప్రత్యేకమైనది. ఈరోజు శని జయంతి, వట్ సావిత్రి వ్రతమే కాకుండా సోమవతి అమావాస్య కూడా ఉంది. అంతేకాకుండా ఇది ఈ సంవత్సరంలో వచ్చే చివరి సోమవతి అమావాస్య.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 10:49 AM IST
Somvati Amavasya 2022: ఇవాళే సోమవతి అమావాస్య... పితృ దోషం పోవాలంటే  ఈ పనులు చేయండి!

Somvati Amavasya 2022: జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైనది. శని జయంతి మరియు వట్ సావిత్రి వ్రతం వంటి ముఖ్యమైన పండుగలు ఈ రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది జ్యేష్ఠ మాస అమావాస్య సోమవారం కావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. అంటే సోమవతి అమావాస్య (Somvati Amavasya 2022). ఇది 2022 సంవత్సరంలో చివరి సోమవతి అమావాస్య.

పితృ దోషం పోవాలంటే..
పితృ దోషం పోవాలంటే సోమవతి అమావాస్య రోజు చాలా ముఖ్యమైనది. పితృ దోషం వల్ల కుటుంబంలో, వృత్తిలో సమస్యలు వస్తాయి. కాబట్టి పితృ దోషాన్ని వీలైనంత త్వరగా బయటపడాలి. ఈ సోమవతి అమావాస్య నాడు శని గ్రహం 30 సంవత్సరాల తర్వాత తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉండనుంది. ఈ రోజున చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. 

ఈ పనులు చేయండి
**సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి. పవిత్ర నదీజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
**స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ధార్పణ చేయాలి.
**పితృ దోషం నుండి బయటపడటానికి, పూర్వీకులకు తర్పణం-శ్రాద్ధం చేయండి. విరాళం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులయి..మిమ్మిల్ని ఆశీర్వదిస్తారు. పితృ దోషం తొలగిపోతుంది. సోమవతి అమావాస్య రోజున పితృ దోషం పోవాలంటే బ్రాహ్మణులకు దానం చేయండి.
**సోమవతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు మరియు పేదలకు గొడుగు, పాదరక్షలు, దోసకాయ, ఫ్యాన్ మొదలైన వాటిని దానం చేయండి.
**సోమవతి అమావాస్య రోజున మర్రి చెట్టును పూజించండి. దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల త్రిమూర్తులు సంతోషపడతారు. ఇది పితృ దోషం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Shani Jayanti 2022: ఇవాళ 4 రాశులవారికి 'రాజయోగం' పట్టనుంది.. అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News