Raksha Bandhan 2022: రక్షాబంధన్ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Sawan 2022: శ్రావణ మాసం ప్రారంభమైన వెంటనే పండుగల సందడి నెలకొంటుంది. ఈ మాసంలోనే  సోదరసోదరీమణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రక్షాబంధన్ పండుగ వచ్చేది. రక్షాబంధన్ తేదీ, ముహూర్తం గురించి తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 03:12 PM IST
  • జూలై 12న ప్రారంభంకానున్న శ్రావణ మాసం
  • శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రత్యేకం
  • రక్షా బంధన్ తేదీ, మంచి సమయం
Raksha Bandhan 2022: రక్షాబంధన్ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Sravana Masam 2022: హిందూ మతంలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెల శివుడికి (Lord Shiva) ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో భోలేనాథ్‌ను పూర్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై నుండి ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ఈ మాసంలో పవిత్రమైన రక్షాబంధన్ (Raksha bandhan 2022) పండుగ వస్తుంది. దీని కోసం సోదరసోదరీమణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రక్షాబంధన్ ఎప్పుడు, అనుకూల సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

శ్రావణ మాసం తేదీలు
శ్రావణ మాసం (Sravana Masam) 14 జూలై 2022 నుండి ప్రారంభమై.. ఆగస్టు 12న శ్రావణ పూర్ణిమతో ముగుస్తుంది. శ్రావణ మాసంలోని మొదటి సోమవారం జూలై 18న వచ్చింది. ఈ రోజున శ్రావణ సోమవారం సందర్భంగా ఉపవాసం ఉంటారు.  రెండో సోమవారం జూలై 25, మూడో సోమవారం ఆగస్టు 1, నాల్గో సోమవారం ఆగస్టు 8 మరియు చివరి సోమవారం ఆగస్టు 12. ఈసారి శ్రావణ మాసంలో మొత్తం ఐదు సోమవారాలు రానున్నాయి. 

రక్షాబంధన్ తేదీ మరియు శుభ సమయం
ఈసారి అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్లా పవిత్ర పండుగ రక్షాబంధన్ ఆగస్టు 11న వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసం యొక్క శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 11 ఉదయం 10.38 నుండి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 వరకు ఉంటుంది.

రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం
రాఖీ కట్టే శుభ ముహూర్తం ఆగస్టు 11న ఉదయం 9.28 గంటలకు ప్రారంభమై రాత్రి 9.14 గంటలకు కొనసాగుతుంది. ఈ శుభ సమయంలో సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టవచ్చు.

శ్రావణ మాసం ప్రాముఖ్యత
హిందూ మతం ప్రకారం, శ్రావణ మాసం శివుడికి అంకితం చేయబడింది.  నెల పొడవునా పరమేశ్వరుడు పూజించబడతాడు. ప్రజలు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.  

Also Read: Vastu Tips for Nails Cut: రాత్రిపూట పొరపాటున కూడా గోళ్లు కత్తిరించకండి.. భారీగా నష్టపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News