Sravana Masam 2024 Lucky Zodiac Signs: హిందూ పురాణాల్లో శ్రావణ మాసనాకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులంతా మహా శివుడిని పూజిస్తారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం చంద్రమానం ప్రకారం ఆగస్టు 05వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 03వ తేదికి ముగుస్తుంది. ఈ ఏడాదిలో వచ్చే శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడమే కాకుండా నక్షత్ర సంచారాలు, సంయోగాలు చేయబోతున్నాయి. అంతేకాకుండా దాదాపు 72 ఏళ్ల తర్వాత ఎంతో శక్తివంతమైన నాలుగు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో ఈ ఏడాది వచ్చిన శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో సూర్యభగవానుడిని పూజించడమే కాకుండా శివుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి.
ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరంలో కూడా శ్రావణ మాసంలో 5 సోమవారాలు రాబోతున్నాయి. ఈ సమయంలో సర్వార్థ సిద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ యోగం, ఇతర యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంయోగం చేయడం కారణంగా కూడా కొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా శుక్రాదిత్య, బుధాదిత్య యోగంతో పాటు నవ పంచమ యోగం, గజకేసరి యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ శ్రవణ మాసం ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
మేష రాశి:
ఈ శ్రావణ మాసంలో ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా మేష రాశివారికి చాలా బాగుటుంది. దీంతో పాటు వీరికి విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి డబ్బు కూడా పొందుతారు. దీంతో పాటు భాగస్వామ్య జీవితం గడిపేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే స్నేహితుల సపోర్ట్ నుంచి కొత్త ఉద్యోగాలు కూడా పొందుతారు. అలాగే సమాజంలో గౌరవంతో పాటు ఆదాయం, కీర్తి రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు.
వృషభ రాశి:
ఈ సమయం వృషభ రాశివారికి చాలా బాగుంటుంది. వీరు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినడమే కాకుండా సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి పెరిగి ఆర్థికంగా కూడా మెరుగుపడతారు. అలాగే మతపరమైన విషయాలపై ఆసక్తి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు రాజకీయం రంగంలో పనులు చేసేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి కళ, సంగీతం పట్ల విపరీతమైన అసక్తి పెరిగి అనుకున్న వాటిల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుటుంది. అలాగే ఉద్యోగ మార్పులు కూడా జరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి ఆనందం కూడా పెరుగుతుంది. దీంతో పాటు పిల్లల నుంచి కూడా ఊహించని శుభ వార్తలు వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి