Sun transit 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Sun transit in taurus 2023: ఈరోజు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి గోచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 15, 2023, 09:24 AM IST
Sun transit 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే  డబ్బు.. ఇందులో మీరున్నారా?

Surya Gochar 2023 effect: సూర్యభగవానుడు సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. ఇవాళ అంటే మే 15న ఆదిత్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో జూన్ 15 వరకు భానుడు ఉంటాడు. సూర్యుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుని సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

సింహ రాశి: ఈ రాశికి అధిపతిగా సూర్యుడిని భావిస్తారు. వీరిపై ఆదిత్యుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతలను తీసుకుంటారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ధనుస్సు: ఆదిత్యుడి గోచారం మీకు ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. 

Also Read: Navapancham Raja Yoga: రాబోయే కొన్ని రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?

కర్కాటకం: సూర్యుడి సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 
మీనం: భానుడు సంచారం మీనరాశి వారి కెరీర్ లో ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. 

Also Read: Budh Margi 2023: ఈరోజు నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News