Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే డబ్బు..

Sun Transit In Leo August 2024: ఆగస్టు 16న సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నారు. అయితే ఈ రాశిలోకి సూర్య గ్రహం దాదాపు సంవత్సరం తర్వాత ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 13, 2024, 11:32 AM IST
Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే డబ్బు..

Sun Transit In Leo August 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహం ఒక రాశి నుంచి తన సొంత రాశిలోకి తిరిగి రావడానికి దాదాపు ఒక సంవత్సరం పాటు టైం పడుతుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 16న సూర్యగ్రహ దాదాపు ఏడాది తర్వాత సింహరాశిలోకి తిరిగి రాబోతున్నాడు. ఈ గ్రహం తన సొంత రాశి అయిన సింహరాశిలోకి తిరిగి రావడానికి దాదాపు సంవత్సరం పాటు సమయం పట్టనుంది. ఈ సమయంలో సూర్య గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా అదృష్టం కూడా తిరిగి వస్తుంది. అయితే ఇప్పటికే సింహరాశిలో బుధ గ్రహంతో పాటు శుక్ర గ్రహం కూడా సంచార దశలో ఉన్నాయి. దీంతో సూర్యుడు కూడా ప్రవేశించడంతో మూడు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా ముందుగా శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రెండు రాజయోగాల కారణంగా ఏయే రాశుల వారు అత్యధిక డబ్బును పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.

మేష రాశి:
మేష రాశి వారికి ఈ రెండు రాజయోగాల కారణం అత్యధిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా ఎలాంటి పరీక్షల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఆశించిన విజయాలను అందిస్తుంది. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి మిశ్రమలహాలు కలుగుతాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి.

మిథున రాశి: 
సూర్యుని సంచారం మిధున రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఏర్పడే రాజయోగాలు కూడా శుభస్థానంలో ఉండబోతున్నాయి. కాబట్టి వీరికి ఆశించిన గొప్ప గొప్ప పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సూర్యుడు అనుగ్రహం లభించి అనుకున్న లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే సూర్యుని ప్రభావంతో లగ్జరీ లైఫ్ను కూడా పొందుతారు. సమాజంలో వీరికి ప్రశంసల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అద్భుతమైన శక్తిని పొందుతారు. 

సింహరాశి: 
సింహ రాశి వారికి ఈ ప్రత్యేకమైన రాజయోగాల ప్రభావంతో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారికి అధికారుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు ప్రభుత్వ మద్దతు లభించి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీంతోపాటు ప్రేమ సంబంధాల్లో కూడా ఆశించని శృంగార జీవితాన్ని గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి కూడా అనుకూలంగా ఉంటుంది.

తులారాశి: 
ఈ రెండు ప్రత్యేకమైన యోగాల కారణంగా తులా రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపరంగా చూస్తే వీరికి కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అలాగే ఎప్పటినుంచో ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నా వారికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్ లభించి అనుకున్నది సాధించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాల నుంచి కూడా సులభంగా విముక్తి లభించబోతోంది. భాగస్వామ్య జీవితంలో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News