Sun Transit 2022: జూలై 16 న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడి గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఏయే విషయాల్ని పరిగణలో తీసుకోవాలని, శ్రద్ధ వహించాలో పరిశీలిద్దాం..
ఈ నెల అంటే జూలై 16 న కర్కాటక రాశిలోకి సూర్యుడి ప్రవేశముంది. కర్కాటక రాశి గురువు చంద్రుడు, సూర్యుడు చంద్రుడి ఇంట్లో నెలవరకూ ఉంటాడు. సూర్యుడి ఈ రాశి పరివర్తనం సమయంలో విభిన్న రాశులపై వేర్వేరు విధాలుగా ప్రభావముంటుంది. సూర్యుడి రాశి మార్పు కారణంగా సింహరాశివారిపై ఏ విధమైన ప్రభావం పడుతుందో చూద్దాం..
సూర్యుడి రాశి పరివర్తనం సింహరాశికి చెందిన ఉద్యోగులకు అప్రమత్తం చేస్తోంది. పనిచేసే చోట ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. యజమానిని సంతోషపెట్టే విధంగా పనిచేయాలి. బాస్‌తో, ఇతర ఉద్యోగులతో ఏ విధమైన ఘర్షణ వాతావరణ లేకుండా పనిచేస్తే..ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు. సరిగ్గా పనిచేయనివారిని ఇతర ప్రాధాన్యత లేని స్థానాల్లో నియామకం ఉంటుంది. అందుకే పనిచేసే చోట పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి పనిచేస్తే ఇబ్బందులుండవు. అందుకే ఎక్కడ పనిచేసినా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.
సింహరాశివారికి ఈ సమయంలో విదేశీ ప్రయాణం ఉండవచ్చు. విదేశీయాత్ర పేరుతో డబ్బులు కూడా ఖర్చవుతాయి. యాత్ర ఏర్పాట్లు సరిగ్గా చేసుకోవల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, వీసా వంటి వాటికోసం అవసరమైన కాగితాల్ని ముందే సిద్ధం చేసుకోవాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశ సమయంలో జ్వరం, జలుబు సమస్యలు రావచ్చు. అందుకే చల్లని పదార్ధాలు లేదా చలవ చేసే పదార్ధాలు పొరపాటున కూడా తినకూడదు. కడుపు సరిగ్గా ఉంచేందుకు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తినే ఆహారంలో ఏ మాత్రం తేడా ఉన్నా..అనారోగ్యం పాలవుతారు. శ్రావణమాసం కావడంతో నాన్‌వెజ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎక్కువసేపు మొబైల్, టీవీ, ల్యాప్‌ట్యాప్ చూస్తే కళ్లపై ప్రభావం పడుతుంది.
Also read: Sravana masam Diet: శ్రావణమాసం సోమవారం వ్రతంలో ఏం తింటే మంచిది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook