Surya Gochar 2022: దీపావళికి ముందు రాశిని మార్చబోతున్న సూర్యభగవానుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు..

Surya Gochar 2022: ఈనెల 17న సూర్యభగవానుడు తులరాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశిమార్పు 5 రాశులవారికి లాభిస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2022, 08:31 AM IST
Surya Gochar 2022: దీపావళికి ముందు రాశిని మార్చబోతున్న సూర్యభగవానుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు..

Surya Gochar 2022: సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. కిందట నెలలో కన్యారాశిలో ఉన్న సూర్యుడు ఈ నెలలో తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రేమ, సంపద, లగ్జరీ లైఫ్ ను ఇచ్చే గ్రహం శుక్రుడు, ఇతడు తులరాశికి అధిపతి. శుక్రుడి రాశిలో సూర్య సంచారం (Sun transit in libra 2022) ఈనెల 17న జరగబోతుంది. ఇది 5 రాశులవారికి భారీ లాభాలను తెస్తుంది. తులరాశిలో సూర్య సంచారం వల్ల ఏయే రాశులవారు మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

వృషభం (Taurus): సూర్య సంచారం వల్ల ఈ రాశివారు ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు. అదృష్టం కలిసి వచ్చి వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. 

సింహరాశి (Leo): సూర్యుని రాశి మార్పు సింహ రాశి వారికి కెరీర్ లో పురోగతిని ఇస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పనిలో ఒత్తిడి ఉంటుంది, అయినా సరే మీ వర్క్ ను సక్రమంగా పూర్తిచేస్తారు. 

ధనుస్సు రాశి (Sagittarius): సూర్యుడి రాశి మార్పు వల్ల ఈరాశివారు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వింటారు. మీరు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలను పొందవచ్చు. శాలరీ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి.

మకరరాశి (Capricorn): తులారాశిలో సూర్యుని ప్రవేశం మకర రాశి వారికి లాభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

మీనరాశి (Pisces): సూర్యుని రాశి మార్పు మీన రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భారీ లాభాలను గడిస్తారు. డబ్బు నష్టం ఉండే అవకాశం ఉంది. 

Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News