Surya Grahan 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహానికి ప్రత్యేక ఉంటుంది. గ్రహణం కారణంగా శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఏర్పడబోయే మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీనికి కారణంగా మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన సంభవించబోతోంది. అయితే కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణ ప్రభావం కొంతవరకైనా ఉండే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. ఏప్రిల్ 8వ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారు ప్రభావితం అవుతారని వారంటున్నారు.
ఈ సూర్యగ్రహణం కారణంగా జాతకంలో సూర్యగ్రహం శుభస్థానంలో ఉంటే, ఈ సమయంలో ఊహించని లాభాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ గ్రహణం ఆ మరుసటి రోజు అర్ధరాత్రి ఒక గంట వరకు కొనసాగుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయో సూర్యగ్రహణం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి:
మొదటి సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో అనేక ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా మంచి కంపెనీల నుంచి గొప్ప ఆఫర్స్ పొందుతారు. అలాగే కుటుంబంలో కూడా ఆనంద వాతావరణ నెలకొంటుంది. దీంతోపాటు వాహన సౌఖ్యం పెరిగి ఒక చోటు నుంచి ఒక చోటికి సులభంగా ప్రయాణిస్తారు. ఇక దాంపత్య జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.
మిథున రాశి:
ఈ సూర్యగ్రహణం కారణంగా ఏర్పడే ప్రభావం మిథున రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వీరు అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతోపాటు తల్లిదండ్రుల నుంచి డబ్బు కూడా పొందే అవకాశాలున్నాయి. అలాగే వీరికి ఈ సమయంలో సంగీతంపై మరింత ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.
సింహ రాశి:
ఈ సమయం సింహ రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. కుటుంబంలో కూడా మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమయం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు అలాగే పిల్లలనుంచి కూడా వార్తలు వింటారు. దీంతోపాటు ఈ సమయంలో తల్లి లేదా తండ్రి నుంచి డబ్బు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుంచి సపోర్టు లభించి మోషన్స్ కూడా లభిస్తాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఏర్పడబోయే మొదటి సూర్యగ్రహణం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధికారుల నుంచి సపోర్టు లభించి వీరు ప్రగతికి బాటలు వేస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయం కూడా రెట్టింపు అయ్యి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే మనసులో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి