Surya Rashi Parivartan 2023: అక్టోబర్ 18 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో అదృష్టం వెలగబోతోంది!

Surya Rashi Parivartan 2023: అక్టోబర్ 18న సూర్యగ్రహం సంచారం చేయబోతోంది..దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశితో పాటు మరికొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2023, 01:29 PM IST
Surya Rashi Parivartan 2023: అక్టోబర్ 18 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో అదృష్టం వెలగబోతోంది!

 

Surya Rashi Parivartan 2023: అక్టోబర్ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అందులో ఎంతో ముఖ్యమైన సూర్యగ్రహం కూడా సంచారం చేయబోతోంది. ఈ సంచారం అక్టోబర్ 18న జరగబోతోంది.  సూర్యభగవానుడు కన్యారాశి నుంచి తులరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ సంచారం కారణంగా అన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కొన్ని రాశులవారికి ఈ గ్రహం సంచారం చేస్తే రెట్టింపు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి: 

మేష రాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఆర్థికంగా, సామాజికంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. 

వృషభ రాశి:
సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి ఆర్థికంగా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైన ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా కెరీర్‌ మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం లావాదేవీలకు అనుకూలమైనగా భావించవచ్చు. సమాజంలో కూడా మంచి గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

మిథున రాశి: 
సూర్యగ్రహం సంచారం మిథున రాశివారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో స్నేహితుల మద్దతు లభించి అన్ని పనులు సకాలం చేయగలుగుతారు. 

కన్య రాశి:
ఈ సమయం కన్య రాశివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పదవులు, ప్రతిష్టలు ఈ సమయంలో సులభంగా పెరుగుతాయి. వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News