Tirumala Yatra: దళిత గిరిజనుల్ని తిరుమల దర్శన యాత్ర ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామి

Tirumala Yatra: హిందూమత ప్రచారానికి స్వరూపానందేంద్ర స్వామి నడుం బిగించారు. దళిత గిరిజనుల కోసం ఆయన తిరుమల యాత్ర చేపట్టారు. సింహాచలంలో పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2021, 05:24 PM IST
Tirumala Yatra: దళిత గిరిజనుల్ని  తిరుమల దర్శన యాత్ర ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామి

Tirumala Yatra: హిందూమత ప్రచారానికి స్వరూపానందేంద్ర స్వామి నడుం బిగించారు. దళిత గిరిజనుల కోసం ఆయన తిరుమల యాత్ర చేపట్టారు. సింహాచలంలో పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది.

హిందూమత ప్రచారాన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లనున్నామని శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. త్వరలో స్వాత్మానందేంద్ర స్వామి భారతదేశ యాత్ర ప్రారంభించనున్నారన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం యావత్ దేశానికి చెందిందని చెప్పారు. దళిత గిరిజనుల్ని తిరుమలకు తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. చిన్న ముసిడివాడ శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో గిరిజనుల్ని తిరుమలు తీసుకుని బయలుదేరారు. సింహాచలంలో ముందుగా పూజలు చేసిన యాత్ర ప్రారంభించారు. 

ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించిన స్వామి స్వరూపానందేంద్ర స్వామి(Swaroopanandendra swamy)పలు విషయాలు వెల్లడించారు. దేవాదాయ భూముల పరిరక్షణలో శారదాపీఠం ముందుంటుందన్నారు. ప్రతియేటా గిరిజనులను తిరుమల యాత్ర(Tirumala yatra)కు తీసుకెళ్లి అందరికీ దేవుని అనుగ్రహాన్ని కల్గిస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర పీఠాధిపతి పర్యటన ఇప్పటికే పూర్తైందన్నారు. శారదా పీఠమనేది కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందింది కాదని..యావత్ ప్రపంచంలోని హిందూవులదన్నారు. హిందూ మత పరిరక్షణకు శారదా పీఠం కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్లుగా విశాఖ శారదా పీఠం హైందవ ధర్మం కోసం పోరాడుతోందన్నారు. 

Also read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 29, 2021 Rasi Phalalu, వారి చేతికి ఆస్తి దక్కనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News