Diamond Vastu: వజ్రం ఈ రాశికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.. పొరపాటున ధరిస్తే ఉద్యోగవ్యాపారాల్లో కష్టాలు తప్పవు..

Who Should Not Wear Diamond : జ్యోతిష్యశాస్త్రంలో 9 గ్రహాల స్థితి, రాశిని బట్టి 9 రత్నాలను ధరించమని జోతిష్యులు సలహా ఇస్తారు. అయితే అందరికీ అన్ని రత్నాలు కలిసి రావు. కొన్నింటిని కొన్ని రాశులవారు పొరపాటున కూడా ధరించకూడదు. దీంతో వారికి ఆర్థిక, ఉద్యోగవ్యాపార సమస్యలు చుట్టుముడతాయి. ఈరోజు ఏ రాశివారు వజ్రం ధరించకూడదు తెలుసుకుందాం. 

Written by - Renuka Godugu | Last Updated : Mar 2, 2024, 11:20 AM IST
Diamond Vastu: వజ్రం ఈ రాశికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.. పొరపాటున ధరిస్తే ఉద్యోగవ్యాపారాల్లో కష్టాలు తప్పవు..

Who Should Not Wear Diamond : జ్యోతిష్యశాస్త్రంలో 9 గ్రహాల స్థితి, రాశిని బట్టి 9 రత్నాలను ధరించమని జోతిష్యులు సలహా ఇస్తారు. అయితే అందరికీ అన్ని రత్నాలు కలిసి రావు. కొన్నింటిని కొన్ని రాశులవారు పొరపాటున కూడా ధరించకూడదు. దీంతో వారికి ఆర్థిక, ఉద్యోగవ్యాపార సమస్యలు చుట్టుముడతాయి. ఈరోజు ఏ రాశివారు వజ్రం ధరించకూడదు తెలుసుకుందాం. 

వజ్రాన్ని ధరించడం వల్ల అశేష ప్రయోజనాలు కలుగుతాయి. వజ్రం ఎంతో విలువైంది. ఇది జీవితంలో సంపద, ఆనందం, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఇస్తుంది. ఒకవేళ పొరపాటున ధరించకూడని వ్యక్తులు వజ్రం ధరిస్తే వీటన్నింటికీ ఆ వ్యక్తి దూరమవ్వాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు వజ్రం శుభప్రదంగా పరిగణించరు. అంతేకాదు వీళ్లు వజ్రాభరణాలను ఏ రూపంలోనూ ధరించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ఉద్యోగ వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోంటారు. పొరపాటున కూడా ధరించకుండా ఉండాలి. దీంతో నష్టాలు తప్ప కలిసి వచ్చేదేమి ఉండదు.

జోతిష్యం ప్రకారం మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు రాశులవారు వజ్రం పొరపాటున కూడా ధరించకూడదు. అయితే, కన్య, తుల, మిథున, మకర, కుంభ రాశులకు వజ్రం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జాతకంలో శుక్ర స్థానం బలంగా ఉన్న వ్యక్తులు వజ్రం ధరిస్తే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. 

ఇదీ చదవండి: ప్రతి శనివారం శని దేవుడి ఈ 5 మంత్రాలను పాటిస్తే.. ఆరోగ్యం, డబ్బు, ఐశ్వర్యానికి జీవితంలో లోటుండదు..
అంతే కాకుండా శుక్రుడు క్షీణించి, అస్తమించినవారు పొరపాటున కూడా వజ్రాన్ని ధరించకూడదు. ఈ వ్యక్తులకు డైమండ్ విపత్తులను తీసుకువస్తుంది.ముఖ్యంగా వజ్రం ధరించిన వ్యక్తి తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే అతడి జీవితం నాశనం అవుతుంది.  తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారు కూడా వజ్రం ధరించకూడదు. సరైన జ్యోతిష్య సలహా లేకుండా వజ్రం ధరించడం ఒక వ్యక్తి పతనానికి దారితీస్తుంది. 

ఇదీ చదవండి: ఇంట్లో శివపార్వతుల  ఫోటో ఏ దిక్కున పెట్టాలి? వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది?

వజ్రం ధరించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఏడాదిలోపు లేదా 50 ఏళ్లు దాటిన వ్యక్తులు వజ్రాన్ని ధరించకూడదు.  డైమండ్ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. విరిగిన వజ్రాన్ని ఎప్పుడూ ధరించకూడదు. అంతేకాదు మన చేది ఉంగరాలు ఇతరులు ధరించడానికి ఇవ్వకూడదు. ఇది వారి నెగిటివిటీని ప్రవహించేలా చేస్తుంది. ముఖ్యంగా వజ్రం ధరించేవారు దీంతోపాటు పగడం ధరించకుండా జాగ్రత్తవహించాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News