Tirumala: తిరుమలలో మూడో రోజు సింహ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు..

Tirumala simha Vaahana Seva: తిరుమలలో ఎంతో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు మూడో సింహ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 6, 2024, 09:44 AM IST
Tirumala: తిరుమలలో మూడో రోజు   సింహ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు..

Tirumala:తిరుమలలో అత్యంత వైభోవేపేతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు మూడో రోజు సింహ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

తిరుమల మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో పాల్గొని తరించారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీర‌బ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా శ్రవణ నక్షత్రం రోజున ధ్వజా అవరోహనంతో పాటు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News