Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 09 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today 09 June 2021: తొందరపాటును నియంత్రించండి మరియు కోపం ద్వారా పనులు పూర్తికావు. పనులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడుతాయి. నూతన ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2021, 08:21 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 09 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today 09 June 2021: మేష రాశి
మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ పరిశీలించుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డబ్బు అవసరం అవుతుంది. దూరప్రయాణాలు చేయడానికి సిద్ధపడతారు. ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యాపార సంబంధిత సమస్యలపై దృష్టిసారిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం, వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృషభ రాశి
మీ తీరుతో సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. పనిచేసే చోట కొత్త జ్ఞానాన్ని పొందడం మీ సామర్థ్యాలను బలపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు పనిలో శుభవార్తలు అందుతాయి. కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

మిథున రాశి
మీ జీవి భాగస్వామి గురించి మీ సందేహం కేవలం అనుమానమేనని తేలుతుంది. మంచి పనులతో దినచర్యను ప్రారంభించడం ద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాల ద్వారా ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు. కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటక రాశి 
కొన్ని కీలక నిర్ణయా ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మిమ్మల్ని కలవరపరిచే నొప్పి, అనారోగ్య సమస్య షరిష్కారం అవుతుంది. ప్రయాణాలు చేయాలనుకోవడం ప్రస్తుతానికి విరమించుకోవడం ఉత్తమం. ఉద్యోగులకు పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. 

సింహ రాశి
తొందరపాటును నియంత్రించండి మరియు కోపం ద్వారా పనులు పూర్తికావు. పనులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడుతాయి. నూతన ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

కన్య రాశి
ఖర్చులు అధికం అవుతాయి. దీనివల్ల పని నుంచి కాస్త విశ్రాంతి తీసుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. పోటీలో ఇతరులను ఓడించటానికి వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. బంధువులు, సన్నిహితులతో వివాదాలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు మీకు భారంగా మారతాయి.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

తులా రాశి
మీ పనిని పూర్తి చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అందుకు అడ్డంకులు కలిగిస్తారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో ఆలయాలు సందర్శించాలనుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి ఉండదు. 

వృశ్చిక రాశి 
మీరు చేపట్టిన పనులను కుటుంబసభ్యులు అంగీకరించరు. మీకు కుటుంబం నుంచి మద్దతు లభించదు. ఆస్తి ఒప్పందంలో మీ డబ్బు చేతికి రావడానికి అధికంగా శ్రమిస్తారు. మీ జీవిత భాగస్వామికి ఈరోజు గుర్తుండిపోయే కానుక ఇవ్వనున్నారు.

ధనుస్సు రాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. యోగా మరియు ధ్యానం లాంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఒకరిని ఒప్పించడం కష్టమని మీరు భావించిన సందర్భంలో ఒత్తిడికి లోనవుతారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు పని భారం తగ్గనుంది.

Also Read: Sun Halo Spotted in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం

మకర రాశి
ఈ రోజు మీకు ఇష్టమైన ఆహారం తీసుకుంటారు. అవసరమైతే మాత్రమే ప్రయాణం చేయాలని భావిస్తారు. పనిచేసే చోట మరోసారి పరిశీలించాల్సిన ప్రాజెక్ట్ మీ ముందుకు రానుంది. ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఆస్తి వివాదాలలో ఓ పరిష్కారం దొరకనుంది.

కుంభ రాశి
నగదును అనవసర విషయాలకు ఖర్చు చేయకూడదని గ్రహిస్తారు. కానీ గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా లాభాలు అందుకోలేరు. ఇతరుల కోసం కొంత నగదు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీ చేతికి నగదు అందుతుంది.  మీరు పనిచేసే చోట కొన్ని వస్తువులు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.  మీ శ్రేయస్సు, క్షేమం కోరుకునే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు పనికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారులకు లాభదాయకం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News