Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 16 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు

Today Horoscope In Telugu 16 June 2021: ఈ రోజు కొన్ని విషయాలలో అతిగా స్పందించవచ్చు. సొంత నిర్ణయాలతో ముందుకుసాగితే మీ సందేహాలు తొలగిపోతాయి. పునరాలోచనతో మీకు స్పష్టత వస్తుంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనికి తగిన ప్రతిఫలం పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2021, 08:25 AM IST

Trending Photos

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 16 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు

Horoscope Today 16 June 2021: మేష రాశి
ఏదైనా చేయాలనే స్వభావం ఉంటుంది. మీకు ఆసక్తి లేనిదాన్ని చేయడానికి ఇష్టపడరు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. అధికంగా శ్రమించిన ఫలితం ఉండదు. ఉద్యోగులకు పనిలో అవాంతరాలు తలెత్తుతాయి. 

వృషభ రాశి
ఈ రోజు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. ఇష్టమైన పుస్తకాలను చదువుతారు. మీ పని పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు. మరోవైపు అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read: Hanuman Puja Vidhanam: హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్ని తొలగి, కోరికలు నెరవేరుతాయట

మిథున రాశి
మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకోసం ఏదైనా చేయాలని ప్రయత్నిస్తారు. వేచి ఉండడం ద్వారా మీ అవకాశాలు మెరుగవుతాయి. వివాహితులు జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. గతంలో ఇచ్చిన నగదును ఇతరుల నుంచి సేకరిస్తారు. మీ చేతికి ఆస్తి దక్కనుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.

కర్కాటక రాశి 
మీరు ఎదరుచూస్తున్న వ్యక్తి చాలాకాలం తరువాత మీ వద్దకు రాబోతున్నారు. వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఖర్చులు అధికం కానున్నాయి. ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత కరువవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. 

సింహ రాశి
మీ పనులు మీరు చేసుకోవడం ఉత్తమం. ఇతరులు చేసే పనులతో ప్రభావితం కావొద్దు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. మీకు చెడు అనిపించే విషయాలకు దూరంగా ఉండాలి. నూతన వ్యక్తుల ద్వారా శుభవార్తలు అందుతాయి. పనిలో చురుకుగా వ్యవహరించాలి. 

కన్య రాశి
మీకు అత్యంత సన్నిహితుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు. కానీ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో కొన్ని విషయాలపై చర్చ, వాదనలు జరుగుతాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. వ్యాపారులకు నష్టాలు గోచరిస్తున్నాయి. 

Also Read: Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?

తులా రాశి
ఈరోజు మీరు నూతనోత్సాహంగా ఉంటారు. కొందరు ప్రజలు ఈ రోజు మీ చుట్టూ ఉండాలని కోరుకుంటారు. వారితో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలలో వెనకడుగు వేసే అవకాశాలున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో కలిసొస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

వృశ్చిక రాశి 
కొన్ని విషయాలలో మీరు ఒత్తిడికి లోనవుతున్నారు. నేడు కొంత విరామం తీసుకుని పనులు పూర్తి చేసుకోవాలి. పనిచేసే చోట అధికంగా శ్రమించినా ఫలితం ఉండదు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు రాశి
ఈరోజు మీకు అనుకూలం. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. ఒకేసారి పలు విధాల పనులు చేయడం ద్వారా ఒత్తిడికి లోనవుతారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. 

మకర రాశి
ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలు గాడి తప్పుతున్నాయి. స్నేహితుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకోలేరు.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

కుంభ రాశి
రుచికరమైన, ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తినాలి. పరిస్థితి దిగజారకముందే జాగ్రత్తపడాలి. చురుకుగా ఉండడం ద్వారా కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. చేపట్టిన పనులలో ముందడుగు పడుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

మీన రాశి
ఈ రోజు కొన్ని విషయాలలో అతిగా స్పందించవచ్చు. ఏదైనా విహారయాత్రలు చేయాలని భావిస్తే ప్లాన్ మార్చుకోవద్దు. సొంత నిర్ణయాలతో ముందుకుసాగితే మీ సందేహాలు తొలగిపోతాయి. పునరాలోచనతో మీకు స్పష్టత వస్తుంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనికి తగిన ప్రతిఫలం పొందుతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News