Todays Horoscope: గ్రహాల కదలికల్ని బట్టి వివిధ రాశులకు అనుగుణంగా దినఫలాలు అంటే ఏరోజు ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కార్తీక మాసం ముగిసి..మార్గశిరమాసం ప్రారంభమైపోయింది. ఇవాళ ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశివారికి ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్థులు ఎక్కువ కష్టపడితేగానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రతికూల పరిస్థితులుంటాయి.
వృషభరాశి : ఈ రాశివారికి కుటుంబ జీవితంలో అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్ధికంగా మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్య.పరంగా కాస్త ఇబ్బంది ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్ధికంగా పరిస్థితి మెరుగుపడటంతో పాత రుణాలు తీరిపోతాయి. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇంటి వాతావరణం ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది.
మిధున రాశి : ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్ధికంగా బాగుంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటుంది.
కర్కాటక రాశి : ఈ రాశివారికి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. డబ్బులకు సంబంధించి పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కుటుంబం విషయంలో రోజువారీ వివాదం చికాకు కల్గిస్తుంది. చేపట్టిన, చేపట్టాల్సిన పనుల విషయంలో ప్రతికూలంగా ఉంటుంది.
సింహ రాశి : ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఇవాళ ప్రతికూల పరిస్థితులుంటాయి. మీ యజమానిని అర్ధం చేసుకుని నడవాల్సి ఉంటుంది. ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలెదురవుతాయి. వ్యాపారస్థులైతే కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆప్యాయత, మద్దతు లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.
తుల రాశి : ఈ రాశివారిలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అటు ఆర్ధికంగా కూడా బాగానే ఉంటుంది. విద్యార్ధులకు చాలా అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో బాగుంటుంది. విద్యార్ధులైతే శుభవార్తలు వింటారు. చదువులో ఆటంకాలు తొలగిపోతాయి.
వృశ్చిక రాశి : ఈ రాశివారిలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆర్ధికంగా ప్రతికూలంగా ఉంటుంది. డబ్బు సంపాదన విషయంలో నిరాశ ఎదురైనా..ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులుంటే సమస్యగా మారుతుంది. కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి : ఈ రాశివారిలో ఆరోగ్యపరంగా బాగుంటుంది. అటు ఆర్ధికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇంట్లో కూడా ప్రశాంతత, ఆనందం లభిస్తుంది.
మకర రాశి : ఈ రాశివారిలో ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తుతుంది. మానసిక ఒత్తిడి పెరగడంతో శారీరకంగా సమస్యగా ఉంటుంది. ఆర్ధికంగా బాగున్నా..జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులైతే మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఎగుడుదిగుడులుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి : ఈ రాశివారిలో ఆరోగ్యపరంగా అప్రమత్తత చాలా అవసరం. ఆర్ధికపరంగా చాలా బాగుంటుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. వ్యాపారస్థులకు మంచిగా ఉండి..కొత్త ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చు. ఉద్యోగస్థులు జాగ్రత్తగా పని చేయాలి. ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి.
మీన రాశి : ఈ రాశివారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో సమతూల్యత అవసరం. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగస్థులైతే జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అవమానాలు ఎదురు కావచ్చు. జీవిత భాగస్వామితో ప్రతికూలంగా ఉంటుంది. అనవసర వివాదాల్లో తరదూర్చవద్దు.
Also read: Horoscope Today: ఈ రాశుల వారు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook