Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. వీరిదే ఈ రోజు పై చేయి!

Rasi Phalalu January 29 To 30: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఎంతో కీలకమైనది. సోమవారం కావడంతో కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 11:01 PM IST
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. వీరిదే ఈ రోజు పై చేయి!

January 29 To 30 Rasi Phalalu : హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఈ రోజు జనవరి 29 సోమవారం. ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఏర్పడిన యోగాల కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశివారికి ఈ రోజు చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో సుఖంగా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ సమయంలో తెలియని భయం వెంటాడే ఛాన్స్‌ కూడా ఉంది. పనుల పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి:
ఈ రోజు తల్లి సహాయంతో చిన్ని చిన్న ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబ భాగస్వామి నుంచి కూడా లాభాలు పొందుతారు. బాధ్యతలు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 

మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. మానసిక సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. కుటుంబ సభ్యుల మద్ధుతు లభించి మంచి ఫలితాలు పొందుతారు. భాగస్వామితో గొడవకు దూరంగా ఉండడం చాలా మంచిది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రోజు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పడతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి మార్పులు కూడా వస్తాయి. ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

సింహ రాశి:
ఈ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో ఈ రోజు విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సంపద, ఆస్తుల్లో వస్తున్న సమస్యలు దూరమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

కన్య రాశి:
కన్య రాశివారికి కూడా ఈ రోజు చాలా బాగుటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో స్నేహితుల నుంచి సపోర్ట్‌ లభిస్తుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రను ప్లాన్ చేస్తారు. అంతేకాకుండా ఊహించని శుభవార్తలు కూడా వింటారు. 

తులారాశి:
ఈ రోజు తులా రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అవసరమైన మార్పులకు సిద్ధంగా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. 

వృశ్చిక రాశి:
ఈ రోజు వృశ్చిక రాశివారు వృత్తి పరమైన పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఆఫీసు సమావేశాలలో ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా ప్రమోషన్స్‌ కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది. సాయంత్ర సమయంలో శుభవార్తలు కూడా వింటారు. అదృష్టం కూడా పెరుగుతుంది. 

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారి ఈ రోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కొన్ని పనుల కారణంగా ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా విద్యా పనుల్లో బిజీగా ఉంటారు. వైవాహిక జీవితం కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

మకర రాశి:
ఈ రోజు మకర రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి అవసరమైన ఖర్చులు చేయకపోవడం చాలా మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లభాలు పొందుతారు. అంతేకాకుండా కార్యాలయాల్లో ఇతరలతో గొడవలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంకితభావంతో పనులు కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. 

కుంభరాశి:
ఈ రోజు కుంభరాశి ఉద్యోగ పరంగా చాలా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు రావొచ్చు. కాబట్టి కోపాన్ని నియత్రించుకోవడం చాలా మంచిది. ఓపిగా ముందుకు నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బు సంబధిత సమస్యలు కూడా వస్తాయి. కొత్త ఆదాయ వనరులు కూడా సృష్టిస్తారు. 

మీన రాశి:
మీన రాశివారికి ఈ రోజు స్వల్ప పోటీ ఉండబోతోంది. అయినప్పటికీ చాలా శుభవార్తలు వినే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు మానస్సు కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో పనులు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే ఛాన్స్‌ ఉంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News