Tulsi Plant Rules: హిందూశాస్త్రాల ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అని చెబుతారు. దాదాపుగా ప్రతీ హిందూ కుటుంబం ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఎలా పడితే అలా పెట్టకూడదు. తులసి మొక్కను పెట్టేందుకు వాస్తుశాస్త్రంలో సూచించిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం...
భూమిలో నాటకూడదు :
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ భూమిలో నాటవద్దు. మట్టి కుండ, బకెట్ లాంటి వస్తువుల్లో తులసి మొక్కను నాటాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను చూస్తే ముల్లోకాలను సందర్శించినంత పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు.
శివుడి విగ్రహం వద్ద ఉండచకూడదు :
తులసి మొక్కను శివుడి విగ్రహానికి దగ్గరలో ఉంచకూడదు. అలాగే గణేశుడి విగ్రహానికి కూడా దగ్గరగా ఉంచవద్దు. శివుడు, గణేశుడి పూజలోనూ తులసి దళాలను సమర్పించరాదు.
వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి :
తులసి మొక్కను ఎప్పుడూ వెలుతురు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. చీకటి ప్రదేశంలో తులసి మొక్కను ఉంచవద్దు. ఒకవేళ తులసి మొక్క చీకటి ప్రదేశంలో ఉంటే.. అది ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది.
ముళ్ల మొక్కల వద్ద తులసిని నాటవద్దు
గులాబీ లాంటి ముళ్ల మొక్కల పక్కన తులసి మొక్కను ఉంచవద్దు. అలా చేస్తే నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. తులసి మొక్క వద్ద అరటి మొక్కను నాటడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతారు. అరటిచెట్టు విష్ణుమూర్తికి అంకితం చేయబడినది గనుక అరటి పక్కన తులసి మొక్క ఉంటే లక్ష్మీ-విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.
పైకప్పుపై తులసిని నాటవద్దు:
ఇంటి పైకప్పుపై కూడా తులసి మొక్కను ఉంచవద్దు.ఇంటి పైకప్పుపై తులసి మొక్కను ఉంచడం ద్వారా ఎండ ఎక్కువగా తగలడం, తుఫాన్లు, వాన వచ్చినప్పుడు కింద పడిపోవడం జరగవచ్చు. తులసి మొక్కకు హాని జరిగితే అది ఆ కుటుంబానికి మంచిది కాదు. కాబట్టి ఇంటి పైకప్పుపై తులసి మొక్కను ఉంచవద్దు.
Also Read: Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!
Also Read; IND vs WI 4th T20: రోహిత్ శర్మ ఫిట్.. శ్రేయాస్ అయ్యర్ ఔట్! డ్రీమ్ 11 టీమ్ ఇదే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook