Ugadi Rasi Phalalu - Mithuna Rasi 2024 To 25: క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వారి పంచాంగం.. వివాహం, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయా?

Ugadi Rasi Phalalu - Mithuna Rasi 2024 To 25: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ క్రోధనామ సంవత్సరంలో మిధున రాశి వారు అనేక రకాల లాభాలు పొందుతారు ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. అలాగే ఆరోగ్యం దెబ్బ తినకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 4, 2024, 10:56 PM IST
Ugadi Rasi Phalalu - Mithuna Rasi 2024 To 25: క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వారి పంచాంగం.. వివాహం, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయా?

Ugadi Rasi Phalalu - Mithuna Rasi 2024 To 25 In telugu: తెలుగు నూతన సంవత్సరం పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాండ్యమి తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఇదే రోజు మనం ప్రతి సంవత్సరం ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున ఉగాది పండగ వచ్చింది. ఈరోజు నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 60 తెలుగు సంవత్సరాలలో ఇది 38వది. అంతేకాకుండా ఇది జ్యోతిష్య శాస్త్రంకు ముడిపడి ఉన్న కొత్త సంవత్సరం. అయితే ప్రతి సంవత్సరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు నుంచి అన్ని రాశుల వారి సంవత్సర రాశి ఫలాలు కూడా ప్రారంభమవుతాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ క్రోధి నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా మిధున రాశి వారికి ఈ సమయంలో పురోగతి లభించబోతోంది. అలాగే కొత్త అవకాశాలతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంది. అయితే ఈ సంవత్సరం మిధున రాశి వారికి ఆర్థికపరంగా కుటుంబ జీవితం పరంగా ఆరోగ్యం పరంగా ఎలా ఉండబోతుందో క్రోధనామ సంవత్సర పంచాంగం ప్రకారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యామిలీ పరంగా..
క్రోధనామ సంవత్సరం పంచాంగం ప్రకారం మేష రాశి వారి రాజపూజ్యం - 6, అవమానం - 6 గా ఉండబోతోంది. దీనికి కారణంగా మేష రాశి వారికి కొత్త సంవత్సరం నుంచి కుటుంబ సంబంధాలు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు వీరికి కొత్త కుటుంబ సభ్యులకు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇక వైద్యాపరంగా చూస్తే..
మిధున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం విద్యాపరంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో అనుకున్న సబ్జెక్టులపై ఫోకస్ పెట్టి చదవడం వల్ల ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పరిశోధన విశ్లేషణ రంగాల్లో అపారమైన జ్ఞానాన్ని కూడా పొందుతారు. పై చదువులు చదవాలనుకునే వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. అలాగే ఇతర దేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.

కెరీర్ పరంగా..
కెరీర్ పరంగా మిధున రాశి వారికి ఉగాది పండుగ నుంచి అద్భుతమైన పురోగతు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో అంతగా రాణించకపోయిన ఆదాయ ప్రవాహంలో భాగంగా అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. దీంతోపాటు నైపుణ్యం మెరుగుపరచుకోవడానికి కెరీర్ పరంగా శిక్షణపై కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. 

ఆరోగ్య విషయానికి వస్తే..
మిధున రాశి వారికి ఆరోగ్య విషయం పరంగా చూస్తే, ఇంతకు ముందున్న ఆరోగ్యం కంటే ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడితే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవడం ఎంతో మంచిది. ఈ సమయంలో జ్వరంతోపాటు దగ్గు జలుబు వచ్చే అవకాశాలున్నాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

వివాహయోగం..
ఈ కొత్త సంవత్సరంలో వివాహం జరుపుకోవాలని వారికి మంచి భాగస్వామి లభిస్తుంది. అంతేకాకుండా ప్రేమ జీవితం కొనసాగిస్తున్న వారికి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు పనిని బ్యాలెన్స్ చేస్తూ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండడం వల్ల ఈ సమయం ఎంతో మాధుర్యంగా మారుతుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News