Vamana Dwadashi 2022: వామన ద్వాదశి ఎప్పుడు? ఈ రోజున ఏం చేయాలి?

Vaman Dwadashi 2022: రాక్షస రాజు బలిచక్రవర్తి గర్వాన్ని అణచడానికి శ్రీమన్నారాయణుడే స్వయంగా వామనుడిగా అదితి గర్భమును జన్మిస్తాడు. దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 03:59 PM IST
  • శ్రీమహావిష్ణువు అవతారాల్లో వామన అవతారం ఒకటి \
  • జూలై 11న వామన ద్వాదశి పాటిస్తారు
Vamana Dwadashi 2022:  వామన ద్వాదశి ఎప్పుడు? ఈ రోజున ఏం చేయాలి?

Vamana Dwadashi date Puja Vidhi 2022: హిందూపురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో వామన అవతారం ఒకటి. వామన ద్వాదశి (Vaman Dwadashi 2022) తిథి ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ద్వాదశి రోజున జరుపుకుంటారు. ఈసారి వామన ద్వాదశి జూలై 11న సోమవారం వస్తుంది. ఈ రోజున శ్రీహరిని ఆరాధిస్తారు. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

వామనుడు జన్మ వృత్తాంతం
కశ్యపుడు, అదితికి జన్మించినవాడు వామనుడు. దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు చేతిలో ఓడిపోతాడు బలి చక్రవర్తి. రాక్షసులు గురువైన శుక్రాచార్యుడు ఉపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథాన్ని, శక్తివంతమైన ధనస్సు, అక్షీయ తూణీరాలు పొంది.. రాక్షసుల అందరినీ కూడగట్టుకుని దేవేంద్రుడిపైకి యుద్ధానికి వెళతాడు. బృహస్పతి సూచనలు మేరకు దేవతలు అమరావతిని వీడి పారిపోతారు. బలిచక్రవర్తి గర్వమును అణచడానికై శ్రీహరి అదితి గర్భమున జన్మిస్తాడు. బలి చక్రవర్తి దానశీలి. అతడి దగ్గరికి వెళ్లి మూడు అడుగుల నేలను అడుగుతాడు వామనుడు. సరే అంటాడు బలి. వామనుడు త్రివిక్రముడై మెుత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి.. అతడిని దానికి రాజును చేస్తాడు. ఆ రాజ్యానికి స్వయంగా శ్రీహరే కాపలాగా ఉంటాడు. 

 వామన ద్వాదశి రోజున ఏం చేయాలి?
>> వామనుని అనుగ్రహం పొందడానికి వామన ద్వాదశి రోజున కంచు పాత్రలో నెయ్యి దీపం వెలిగించండి. దీంతో మీ ఇంటి కష్టాలు తొలగిపోతాయి. 
>>  మీ వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కొబ్బరికాయపై యాగ్యోపవీతం చుట్టి వామనుడికి సమర్పించండి. మీ పనిలో ఏవైనా ఆటంకాలు ఉంటే ఇది తొలగిస్తుంది. 
>>  వామన ద్వాదశి పూజానంతరం అన్నం పెరుగు దానం చేయడం శుభప్రదం. ఇది ఇంట్లోకి అపారమైన సంపదను తీసుకువస్తుంది.
>>  వామన ద్వాదశి రోజున వామనుని విగ్రహాన్ని పూజించటం వల్ల  శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
>>  వామనుడిని పూజించేటప్పుడు  నైవేద్యంగా 52 లడ్డూలను పెట్టాలి. అందరికీ దక్షిణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వామనుని అనుగ్రహం లభిస్తుంది. పూజానంతరం బ్రాహ్మణుడికి దానం చేయండి. దీంతో మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Also Read: Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రతం ఇలా చేస్తే... ఇంటి నిండా ఐశ్వర్యమే..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News