Varahi Matha: ‘వారాహి’ అమ్మవారి పూజలో తప్పక గమనించవలసిన అంశాలు ఇవే.. పూజా విధానం.. నైవేద్యాలు ఇవే..

Varahi Matha: ‘వారాహి’ అమ్మవారి పూజలో తప్పక గమనించవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. సప్తమాతృకలు లేదా అష్టమాతృకలు ఈ దేవతా మంత్రాల ఉపాసనకు ఉండే పద్ధతులు ఏంటో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 27, 2024, 04:15 AM IST
Varahi Matha: ‘వారాహి’ అమ్మవారి పూజలో తప్పక గమనించవలసిన  అంశాలు ఇవే.. పూజా విధానం.. నైవేద్యాలు ఇవే..

Varahi Matha: ఏ మంత్రమైన గురువు ద్వారా ఉపదేశం పొందాలి.  వారి దిశా నిర్దేశములోనే మూల మంత్రములను అనుసరించాలి. స్వతంత్రించి ఎవ్వరూ    అనుసరించకూడదు.  ఈ తల్లి శ్రీహరి లోని శక్తి... అందుకని అందరూ ఈ తల్లిని  వారాహి నవరాత్రులలో ఆషాడ మాసంలో వచ్చే తొలి  తొమ్మిది  రోజులు రాత్రి కాలంలో సదాచార విధముగా లక్ష్మీ పూజతో అర్చించాలి. లక్ష్మీ స్తోత్ర పాఠములు పఠించాలి. ఉచ్చారణ దోషాలు లేకుండా శక్తి కలిగిన వారు  వారాహి స్తోత్రములు వ్రత నియమలు అనుసరించి పారాయణ చెయ్యాలి.   

యజ్ఞ వరాహా రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీశక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకుని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీదేవి. ఈ శక్తికి సంబంధించిన మంత్రాలకు గురవు ఉపదేశం వంటివి ఉండాలి కానీ, తల్లిగా కొలుచుకునేటపుడు ఆమె స్తోత్రాదులు, "శ్రీ వారాహీదేవ్యైనమః మొదలైన నామములతో ఈ తొమ్మిది రోజులు పూజించడానికి ఇతర దేవతా పూజలకు పాటించే సాధారాణ నియమాలు సరిపోతాయి.

ఇచ్ఛ జ్ఞాన క్రియా శక్తులలో క్రియాశక్తికి ప్రతీక శ్రీ వారాహీదేవి. ఇచ్ఛా - జ్ఞానశక్తులు క్రియాశక్తిలో కలిసి పోయినట్లు, శ్యామలా - లలితాదేవి కలగలసిన రూపం శ్రీ వారాహీదేవి. కిరాత వారాహి, భైరవి, స్వప్న వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలతో, నామాలతో అనుగ్రహించే తల్లిగా ఆమెను కొలుస్తారు. ఈ తొమ్మిది రోజులూ వారాహీ దేవి ప్రీతికై ఉచ్చారణ దోషాలు లేకుండా పెద్దల నుండి అభ్యసించిన వారు.  శ్రీ లలితా సహస్ర నామ, లలితాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాదులు చేసి దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
 
అమ్మవారికి నివేధన

వారాహీ అమ్మవారికీ.. పులిహోర, కట్టు పొంగలి, తీపి పొంగలి, క్షీరాన్నము, దద్ద్యోజనం మొదలగునవి సమర్పిస్తూ... విశేష ప్రత్యేక నివేదనలుగా వారాహీ మాతకు లడ్డూలు మరియు దానిమ్మపండ్లు నివేదించడం ఈ అమ్మవారి పూజలో ప్రత్యేకత.

Also Read: Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News