Remedies to Remove Vastu Dosh: వాస్తు దోషాలు వ్యక్తిగత, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రేమ, పెళ్లి, కెరీర్, ఆర్థిక స్థితి గతులు తదితర అంశాలపై దాని పరోక్ష ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు. అందుకే ఇల్లు నిర్మించుకునేటప్పుడు తప్పనిసరిగా వాస్తు శాస్త్ర నియమాలు పాటిస్తారు. ఒకవేళ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను పాటించడం ద్వారా వాటిని తొలగించవచ్చు. ఆ నియమాలంటే ఇప్పుడు తెలుసుకుందాం...
పంచముఖి దీపం.. :
దీపారాధన అనేది హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. దైవ అనుగ్రహం పొందే పద్దతుల్లో ఇదొకటి. ఇంట్లోని ప్రతికూల శక్తిని ప్రారదోలేందుకు దీపారాధన చక్కగా పనిచేస్తుందని పండితులు, వాస్తు నిపుణులు చెబుతుంటారు. ప్రతీరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందని చెబుతారు. తద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే, ప్రతీ మంగళవారం ఆంజనేయుడిని పూజించేటప్పుడు పంచముఖి దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది.
ఈ నియమాలు తప్పవద్దు :
ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. అక్కడ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సాయంత్రం పూట తులసి పూజ చేయడం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం ఉంచడం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యి దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఇంట్లో ఆహారం, నీరు వృథాగా పోనివ్వవద్దు. నీటిని వృథా చేస్తే పేదిరకం వెంటాడుతుంది. ఇంట్లో ఎప్పుడూ తుప్పు పట్టిన వస్తువులు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచవద్దు. అవి ప్రతికూల శక్తికి మూలాలు.. వాస్తు దోషాన్ని కలిగిస్తాయి. ఆ ఇంటి వారి పురోగతికి ఆటంకంగా మారుతాయి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Apple iphone 11: రూ.51 వేలు విలువ చేసే 'ఐఫోన్ 11' కేవలం రూ.33 వేలకే... డిస్కౌంట్ ఇలా పొందండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.