Vastu Tips: రోజు పడుకునే ముందు ఇలా చేస్తున్నారా? దరిద్ర దేవతకు స్వాగతం పలికినట్టే..

Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం కొందరు రోజు చేసే పనుల్లో భాగంగానే వాస్తు దోషాలు ఉంటున్నాయట. వీటి వల్లే జీవితంలో అనేక ఆటంకాలు వస్తున్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రోజువారి పనుల్లో ఈ క్రింది వాటిని మానుకుంటే జీవితంలో అదృష్టం పెరుగుతుందని వారు అంటున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 3, 2024, 10:39 AM IST
Vastu Tips: రోజు పడుకునే ముందు ఇలా చేస్తున్నారా? దరిద్ర దేవతకు స్వాగతం పలికినట్టే..

Vastu Tips In Telugu: వాస్తు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే వ్యక్తులు ఎలాంటి పనులు చేసిన దురదృష్టాన్నే పొందుతారు. ఎంతో కష్టపడి సంపాదించింది కూడా పెట్టిన చివరికి ఖర్చులే పెరుగుతాయి. అంతేకాకుండా వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల కోటీశ్వరులు కూడా భిక్షాటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే జీవితంలో వాస్తు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మీ అందరికీ పెద్దగా చెప్పనక్కర్లేదు లేదు. అలాగే వాస్తు బాగుంటే కటిక పేదరికంలో ఉన్న వ్యక్తులు కూడా ధనవంతులవుతారు. 

Add Zee News as a Preferred Source

వాస్తనేది కేవలం ఇంటికే పరిమితం కాకుండా.. రోజువారి చేసే పనుల్లో కూడా భాగమైంది. రోజువారి జీవితంలో అనేక పనుల్లో వాస్తు దాగి ఉంది. అందుకే వాస్తు ప్రకారం చేయని పనులన్నీ నిర్విఘ్నంతో ఆగిపోతూ ఉంటాయి. అయితే కొన్ని వాస్తు విషయాలపై జాగ్రత్త వహించి పనులు చేస్తే సులభంగా విజయాలు సాధించడమే కాకుండా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. వాస్తులో పేర్కొన్న కొన్ని విశేషమైన విషయాలను పాటిస్తూ రోజువారి జీవితంలో ముందుకెళ్లడం వల్ల సానుకూల శక్తులు కూడా పెరుగుతాయి దీని కారణంగా ప్రతికూల శక్తి తొలగిపోయి.. ఆర్థికపరమైన జీవితాల్లో అఖండ విజయాలు సాధిస్తారు. 

ప్రస్తుతం చాలామంది వాస్తు దోషాల కారణంగా ఆర్థిక, మానసిక శారీరక సమస్యల బారిన పడుతున్నారు. డబ్బులు తీవ్రంగా నష్టపోయి జీవితంలో అట్టడుగు స్థాయిలో నిలుస్తున్నారు. అయితే మనకు తెలియని కొన్ని పనులే రోజు వారి జీవితంలో వాస్తు దోషాలను తెచ్చిపెడుతున్నాయి. రోజు వారి జీవితంలో చేసే పనుల్లో వాస్తు దోషాలను గుర్తించి.. వాటిని సవరించుకుంటూ ముందుకెళ్తే అదృష్టం మీ దగ్గరికి వస్తుంది. ఇంతకీ ఆ వాస్తు దోషాలను గుర్తించడం ఎలా? అదృష్టానికి ఆటంకం కలిగించే ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. 

చాలామందికి ఉండే అలవాట్లలో ఇది ప్రధానమైంది.. కొంతమంది ప్రతిరోజు పడుకునే దిండు కింద పర్సు లేదా డబ్బులను పెట్టుకొని పడుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం పెద్ద తప్పుగా భావిస్తున్నారు. ఇలా చేస్తే అదృష్టం తొలగిపోయి దురదృష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది నిద్రపోయే క్రమంలో ఏదో ఒకటి చదువుతూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు సర్వసాధారణంగా చాలామందికి ఉంటుంది అయితే చదువుకుంటూ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఆ పుస్తకం అక్కడే బెడ్ పై ఉంటుంది. వీటిని నెమ్మదిగా దిండు కిందికి జరుపుకొని కూడా పడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం మంచిది కాదు.

కొంతమంది నిద్రపోయే సమయంలో పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకొని కూడా పడుకుంటారు. నిద్రలో దాహం వేసినప్పుడు తాగాలని అనుకుంటారు. నిజానికి వాస్తు ప్రకారం నీటిని పక్కన పెట్టుకొని పడుకోవడం అంత మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కూడా అదృష్టం చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News